జౌళి మంత్రిత్వ శాఖ

మాస్కులు/పీపీఈ కిట్ల లభ్యత

प्रविष्टि तिथि: 18 SEP 2020 5:16PM by PIB Hyderabad

ఈ ఏడాది మార్చిలో సున్నాగా ఉన్న పీపీఈ కిట్ల దేశీయ తయారీదారుల సంఖ్యను, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1100కు పెంచింది. వీరిలో ఎక్కువ మంది ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందినవారు. మే నెల మధ్య సమయానికి పీపీఈ కిట్ల తయారీ సంఖ్య గరిష్టంగా రోజుకు 5 లక్షలకు చేరింది. 13.9.2020 నాటికి, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌కు 1.42 కోట్ల పీపీఈ కిట్ల పంపిణీ జరిగింది. ఇది, కేంద్ర ఆరోగ్యం&కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సేకరణల సంస్థ. ఈ సంస్థ ద్వారా సేకరించిన కిట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆరోగ్య నిపుణులకు అందించాం.

ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ 2020 వరకు, పీపీఈ కిట్ల ఎగుమతులను నిషేధిత జాబితాలో చేర్చాం. 28.7.2020 నుంచి 24.8.2020 వరకు నెలకు 50 లక్షల ఎగుమతులకే అనుమతించాం. ఈ కాలంలో అమెరికా, యూకే, ఈఏఈ, సెనెగల్‌, స్లోవేనియాకు మాత్రమే ఎగుమతులకు అనుమతి ఇచ్చాం.

క్రమసంఖ్య

దేశం

జులై-ఆగస్ట్‌, 2020 మధ్య ఎగుమతుల సంఖ్య

1.

యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా

6,00,000

2.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌

4,00,000

3.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌

3,00,000

4.

సెనెగల్‌

4,89,500

5.

స్లొవేనియా

5,00,000

మొత్తం

22,89,500

 

25.8.2020 నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా పీపీఈ కిట్ల ఎగుమతులకు అనుమతించాం. ఎన్‌-95 మాస్కుల ఎగుమతులను 31.1.2020 నుంచి నిషేధించాం. 25.8.2020 నుంచి, నెలకు 50 లక్షలు ఎగుమతి చేసేలా అనుమతులు ఇచ్చాం.

          జౌళి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్‌ ఇరానీ, లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని లోక్‌సభకు సమర్పించారు.

***

 


(रिलीज़ आईडी: 1656453) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Punjabi