ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ నివారణ అంచనా

Posted On: 18 SEP 2020 4:17PM by PIB Hyderabad

చైనాలోని ఊహాన్ నగరంలో పెల్లుబికిన గుర్తు తెలియని న్యుమోనియా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశ కార్యాలయం 2020 జనవరి 6న భారత్ ను అప్రమత్తం చేసింది. 2020 జనవరి 9న నావెల్ కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది.ఆ తరువాత దానికి సార్స్-కోవిడ్-2గా ఆ వైరస్ కు పేరు పెట్టి ఆ తరువాత  ఫిబ్రవరి 11న వ్యాధికి కోవిడ్-19 అనే పేరు నిర్థారించింది.

భారత్ లో తొలి కోవిడ్-19  కేసు 2020 జనవరి 30న బైట పడింది. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించటానికి ముందు అనేక చర్యలు తీసుకోవటంతోబాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం కూడా మొదలైంది. 

వ్యాధి దేశంలోకి రాకుండా చూడటానికి ప్రయాణీకులు వచ్చే చోటనే వారికి పరీక్షలు జరపటం మొదలు పెట్టింది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు. భూసరిహద్దుల దగ్గర జనవరి 18 నుంచే పరీక్షలు జరుపుతూ వచ్చారు. లక్షణాలున్న ప్రయాణీకులను అలా గుర్తించటం మొదలైంది. ఆ తరువాత కోవిడ్ ప్రభావమున్న దేశాలనుంచి వచ్చే  ప్రయాణీకులకూ పరీక్షలు జరపటం చేపట్టారు. సమీకృత వ్యాధి నిఘా కార్యక్రమం కింద అంతర్జాతీయ ప్రయాణీకులను, వారితో సన్నిహితంగా వ్యవహరించినవారికి పరీక్షలు చేశారు. అలా తేలిన అన్ని రాష్ట్రాలు, జిల్లాలలో ఒక నివారణ వ్యూహాన్ని అనుసరించారు. పెద్ద సంఖ్యలో ఒకే చోట వ్యాధి లక్షణాలు కనపడిన క్లస్టర్లు గుర్తించి ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ప్రయాణ నిబంధనలు, నిఘా, సన్నిహితుల ఆచూకి, శాంపిల్ సేకరణ, ఆస్పత్రులకు రవాణా, చికిత్స, డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్ నిరోధం, నియంత్రణ, ఇళ్ళలో క్వారంటైన్ చేయటం తదితర అంశాలన్నిటిమీద మార్గదర్శకాలు జారీచేశారు.

వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ

కేసులు

మరణాలు

23-03-2020

451

9

01-09-2020

3691166

65288

 

మార్చి 16-23 మధ్య అధికభాగం రాష్ట్రాలు, కేంర్రపాలిత ప్రాంతాలు పాక్షికంగాలేదా పూర్తిగా తమ తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థిని బట్టి లాక్ డౌన్ అమలు చేశాయి.

కోవిడ్-19 అత్యంత ఇన్ఫెక్షన్ తో కూడిన వ్యాధి.  అందుకే దాని నివారణ, నియంత్రణ విషయంలో ఒక స్థిరమైన వైఖరి అవలంబించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ వ్యాప్తి గొలుసుకట్టును ఛేదించగలిగేతేనే వ్యాప్తిని అడ్డుకోగలం.

ఈ వాస్తవాలను లెక్కలోకి తీసుకుంటూ ప్రపంచ అనుభవాలను కూడా పరిగణిస్తూ. వైఖరిలో స్థిరంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా వ్యాధి నియంత్రణ చర్యలు పెద్ద ఎత్తున తీసుకున్నారు. కోవిడ్ -19  వ్యాప్తి నివారణ ధ్యేయంగా దేశవ్యాప్తంగా మార్చి 24న  లాక్ డౌన్ ప్రకటించారు.

ఇలా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించటం ద్వారాభారత్ విజయవంతంగా కోవిడ్ దూకుడుకు కళ్ళెం వేయగలిగింది. లాక్ డౌన్ సమయంలోనే దేశం చాలా కీలకమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను సమకూర్చుకోగలిగింది. ఈ సమయంలోనే ప్రత్యేకమైన ఐసొలేషన్ పడకలు రికార్డు స్థాయిలో 22 రెట్లు పెరిగాయి. అది మార్చి 2020 నాటి స్థితితో పోల్చుకుంటే 14 రెట్లు ఎక్కువ. అదే విధంగా లాబ్ ల సామర్థ్యం కూడా దాదాపు పది రెట్లు పెరిగింది. అసలు ఎన్ 95 మాస్కులు గాని పిపిఇ కిట్లు గాని తగిన ప్రమాణాలతో స్వదేశీ తయారీ శూన్యం కాగా  ఇప్పుడు స్వయం సమృద్ధం కావటంతోబాటు వాటిని ఎగుమతి కూడా చేయగలుగుతున్నాం. అదే విధంగా లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో  స్వదేశీ వెంటిలేటర్ల తయారీ నామమాత్రంగా ఉండే పరిస్థితి మారిపోయిైప్పుడు సామర్థ్యం పెంచుకొని స్వయం సమృద్ధం అయ్యాం.

ఇదే సమయంలో వివిధ విభాగాలు, రంగాలకు చెందిన వివిధ హోదాల వ్యక్తులు, వాలంటీర్లు దేశవ్యాప్తంగా కోవిడ్ సంబమ్ద్శమైన పనులలోను, ఇతర అత్యవసర వైద్య సేవలలోను నిమగ్నమయ్యారు. వాళ్ళకు తగిన శిక్షణ ఇవ్వటం, వనరుల అందుబాటు చూడటం, ఆరోగ్య, కుఋంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ఐగాట్ వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ తో సమాచారాన్ని అందుబాటులో ఉంచటం గమనించవచ్చు. (https://igot.gov.in/igot/)

లాక్ డౌన్ నిర్ణయం ఫలితంగా భారతదేశంలో కరోనా సంక్షోభం గణనీయంగా తగ్గినట్టు అంచనావేశారు. దాదాపు 14–29  లక్షల కోవిడ్ కేసులు నివారించగలిగిందని, 37–78  వేల మరణాలు నివారించిందని ఆ అంచనాలు చెబుతున్నాయి.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

***



(Release ID: 1656410) Visitor Counter : 241


Read this release in: English , Manipuri