వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

స్థానిక సంస్థలకు టెండర్లు

Posted On: 18 SEP 2020 3:04PM by PIB Hyderabad

ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద, స్థానిక సంస్థలకు ప్రభుత్వ టెండర్లు దక్కేలా ఈ క్రింది చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.

1. వ్యయ విభాగం (డీవోఈ) 15.05.2020న ఇచ్చిన ఆదేశం 12/17/2019-పీపీడీ (వ్యయ విభాగం వెబ్‌సైట్‌లో దీనిని చూడవచ్చు) ద్వారా, సాధారణ ఆర్థిక నిబంధనలు (జీఎఫ్‌ఆర్‌)-2017లోని 161 (iv) నిబంధన సవరణ జరిగింది. రూ.200 కోట్లకు పైగా విలువైన కాంట్రాక్టు లేదా సరఫరా కోసం 'గ్లోబర్‌ టెండర్‌ ఎంక్వైరీ' (జీటీఈ)ని ఈ సవరణ పరిమితం చేసింది. స్థానిక పరిశ్రమల ప్రయోజనం కోసం స్థానిక టెండర్ల సంఖ్యను పెంచడం దీని ఉద్దేశం.

2. ప్రజా సరఫరాల్లో (భారత్‌లో తయారీకి ప్రాధాన్యం) స్థానిక సరఫరాదారులు పాల్గొనడాన్ని ప్రోత్సహించడానికి, జీఎఫ్‌ఆర్-2017లోని 153(iii) నిబంధన కింద, 'పరిశ్రమలు, అంతర్గత వర్తకం ప్రోత్సాహక విభాగం' (డీపీఐఐటీ) 04.06.2020న ఆదేశాన్ని (వెబ్‌సైట్‌లో చూడవచ్చు) జారీ చేసింది.
 
3. విక్రేతలు, తాము అమ్మే వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయన్న విషయాన్ని గవర్నమెంట్‌ మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) వెబ్‌సైట్‌లో పొందుపరచడాన్ని జీఈఎం తప్పనిసరి చేసింది.

    జీఈఎంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త మార్గదర్శకాలను అనుసరించి 04.06.2020-15.09.2020 మధ్య 50,346 కాంట్రాక్టులను వివిధ విక్రేతలకు అప్పగించారు.
 

    కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌, లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని రాజ్యసభకు సమర్పించారు.

***


(Release ID: 1656197) Visitor Counter : 118


Read this release in: English , Marathi , Tamil