వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పరిశ్రమల అనుమతులు మరియు ఆమోదాలకు ఏక గవాక్ష విధానం
Posted On:
16 SEP 2020 4:21PM by PIB Hyderabad
దేశంలో పరిశ్రమల అనుమతులు మరియు ఆమోదాల కోసం ఏక గవాక్ష విధానంను (సింగిల్ విండో సిస్టమ్) ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఐటీ ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. భారత ప్రభుత్వం మరియు రాష్ట్రాల సింగిల్ విండో క్లియరెన్స్‌లు ఉన్నప్పటికీ.. పెట్టుబడిదారులు సమాచారాన్ని సేకరించడానికి మరియు వివిధ వాటాదారుల నుండి అనుమతులను పొందటానికి గాను పలు వేదికల్ని సందర్శించాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గాను పెట్టుబడికి ముందు సలహాలు, ల్యాండ్ బ్యాంకులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సహా ఎండ్-టు-ఎండ్ ఫెసిలిటేషన్ సపోర్ట్‌లను అందించే కేంద్రీకృతమైన పెట్టుబడి క్లియరెన్స్ సెల్‌ను సృష్టించడం; మరియు కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ఆయా అనుమతులను సులభతరం చేయడం ప్రతిపాదించడమైంది. ఇది 2020-21 బడ్జెట్ ప్రకటన. భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన అన్ని రకాల కేంద్ర మరియు రాష్ట్ర అనుమతులు / ఆమోదాలను పొందటానికి ఒక-స్టాప్ డిజిటల్ వేదికగా ఒక సెల్ ఏర్పాటు ప్రణాళిక చేయబడింది. ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ సెల్ అనేది జాతీయ పోర్టల్. ఇది ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాల క్లియరెన్స్ వ్యవస్థలను అనుసంధానిస్తుంది. భారతదేశం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతమున్న మంత్రిత్వ శాఖల ఐటీ పోర్టల్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా మరియు ఒకే, ఏకీకృత దరఖాస్తు ఫారం కలిగి ఉంటాయి. ఇది పెట్టుబడిదారులు సమాచారాన్ని సేకరించడానికి మరియు వివిధ వాటాదారుల నుండి అనుమతులను పొందటానికి బహుళ ప్లాట్‌ఫారమ్‌లను / కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది మరియు పెట్టుబడిదారులకు సమయానుసారంగా ఆమోదాలు మరియు నిజ సమయ స్థితి నవీకరణలను అందిస్తుంది. తమిళనాడుతో సహా అన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలను సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ పరిధిలోకి తేవడం జరిగింది. ఇంకా, ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఐఎస్) కింద జీఐఎస్ ఎనేబుల్డ్ ల్యాండ్ బ్యాంక్ అభివృద్ధి చేయడమైంది. ఆరు రాష్ట్రాలు హర్యానా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఒడిషా, గోవా రాష్ట్రాల వ్యవస్థలను సమీకృతం చేసి ఈ ఏడాది ఆగస్టు 27న ప్రారంభించడమైంది. ఆయా రాష్ట్రాలు ఇప్పుడు ఆన్‌బోర్డులోకి చేర్చడమైంది. పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, తరగతి ఉత్పాదక మౌలిక సదుపాయాలలో మరింత ఉత్తమంగా నిర్మించడం, వ్యాపారం చేయడం కూడా సులభతరం చేయడం మరియు నైపుణ్య అభివృద్ధిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా 2.0 కింద 27 రంగాలపై దృష్టి సారించింది. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ 15 ఉత్పాదక రంగాలకు కార్యాచరణ ప్రణాళికలను సమన్వయం చేస్తుండగా, వాణిజ్య శాఖ 12 సేవా రంగాలను సమన్వయం చేస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 1655446)
Visitor Counter : 294