హోం మంత్రిత్వ శాఖ
కాశ్మీర్ లో శాంతి పునరుద్ధరణకు చర్యలు
प्रविष्टि तिथि:
16 SEP 2020 3:28PM by PIB Hyderabad
జమ్ము కాశ్మీర్ లో,.. 2020 ఆగస్టు 5నుంచి, 2020 సెప్టెంబరు 10వరకూ ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణల్లో అసులువుబాసి అమరులైన భద్రతాదళ సిబ్బంది, ప్రాణాలు కోల్పోయిన పౌరుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి: -
|
వివరణ
|
ఉగ్రవాద సబంధ సంఘటనలు
|
కాల్పుల విరమణ ఉల్లంఘనలు
|
|
మరణించిన పౌరుల సంఖ్య
|
45
|
26
|
|
అమరులైన భద్రతా సిబ్బంది సంఖ్య
|
49
|
25
|
ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించరాదన్న విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. ఉగ్రవాదం కట్టడి లక్ష్యంగా, వివిధ రకాల చర్యలు తీసుకుంది. భద్రతాపరమైన ఉపకరణాలను, సామగ్రిని పటిష్టపరుచుకోవడం, జాతి వ్యతిరేక శక్తులపై చట్టాన్ని కచ్చితంగా ప్రయోగించడం, ఉగ్రవాద సంఘాల సవాళ్లను ఎదుర్కొనేందుకు సోదాలను మరింత బలోపేతం చేయడం, వారి స్థావరాలుగా భావించే ప్రాంతాలను వలయంగా చుట్టుముట్టడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంది. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించిన వ్యక్తులపై నిశితంగా దృష్టి సారించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, పోలీసులు, ప్రజల మధ్య వివిధ స్థాయిల్లో చర్చలు, సంప్రదింపులు జరపడం, జమ్ము కాశ్మీర్ లో విధులు నిర్వర్తించే అన్ని భద్రతా బలగాలు వాస్తవ పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించడం, భద్రతా దళాల గస్తీని ముమ్మరం చేయడం తదితర చర్యలు పటిష్టంగా అమలు చేశారు.
జమ్ము కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలకోసం సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ (పి.ఎం.డి.పి.-2015)కింద రూ.80,068కోట్లతో భారీ సహాయాన్ని ప్రధాని ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద రహదారుల రంగం, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, ఆరోగ్య మౌలిక సదుపాయాల రంగం, రెండేసి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు, ఐ.ఐ.టి.లు, ఐ.ఐ.ఎం.ల ఏర్పాటు, పర్యాటక సంబంధ పథకాలు, తదితర కార్యక్రమాలను ప్రకటించారు. మొత్తం 63 భారీ అభివృద్ధి ప్రాజెక్టులతో ఈ ప్యాకేజీని రూపొందించారు. ఈ ప్రాజెక్టుల అమలు ప్రస్తుతం వివిధ దశల్లో సాగుతోంది. హిమాయత్ (హెచ్ఐఎంఎవైఎటి), ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి అనేక పథకాల కింద జమ్ము కాశ్మీర్ యువజనులకు శిక్షణ, ఉపాధికల్పన అవకాశాలను కూడా కల్పించారు.
యువతను ప్రధాన జాతీయ స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు వతన్ కో జానో కార్యక్రమానికి, విద్యార్థుల మార్పిడి కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రీడలకు, అలాగే, కేంద్ర సాయుధ పోలీసు బలగాల పౌర కార్యాచరణ పథకానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలియజేశారు.
****
(रिलीज़ आईडी: 1655431)
आगंतुक पटल : 144