హోం మంత్రిత్వ శాఖ

త‌గినంత‌గా లేని ఫోరెన్సిక్ లేబ‌రెట‌రీలు

Posted On: 16 SEP 2020 3:25PM by PIB Hyderabad

కేసుల ప‌రిష్కారం ప‌లు అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అవి  కేసు  ఏ విభాగానికి చెందినది(సివిల్ లేదా క్రిమిన‌ల్), కేసులో ముడిప‌డి ఉన్న‌వాస్త‌వాల సంక్లిష్ట‌త‌, సాక్ష్యం తీరు, స్టేక్ హోల్డ‌ర్ల స‌హ‌కారం వంటివి.పోలీసు, ప‌బ్లిక్ ఆర్డ‌ర్, తోపాటు రాష్ట్రాల ఫొరెన్సిక్ సైన్సు లేబ‌రెట‌రీల‌ను ప‌టిష్ట‌ప‌ర‌చ‌డం  భార‌త రాజ్యాంగంలోని ఏడ‌వ షెడ్యూలులోని అంశం.  

అయితే, రాష్ట్రాల ఫోరెన్సిక్ సైన్సు లేబ‌రెట‌రీల‌ను బ‌లోపేతం చేయ‌డంలో స‌హాయం చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ (ఎం.హెచ్‌.ఎ) కింది చ‌ర్య‌లు తీసుకుంది.

(1)  నిర్భ‌య ఫండ్ కింద 157.98 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో డిఎన్ఎ అనాల‌సిస్‌, సైబ‌ర్ ఫోరెన్సిక్‌, స‌బంధిత స‌దుపాయాల‌ను 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో బ‌లోపేతం చేసే ప్రాజెక్టుల‌కు ఆమోదం.

(2) 2019-21ఆర్థిక సంవ‌త్స‌రంలో  పోలీసు బ‌ల‌గాల ఆధునీక‌ర‌ణ ప‌థ‌కం కింద ఫోరెన్సిక్ సైన్సు లేబ‌రెటరీల బ‌లోపేతానికి మొత్తం రూ 195.97 కోట్ల రూపాయ‌లు ఆమోదం.

(3) ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల‌లో నాణ్య‌త , ప్ర‌మాణాలు  పాటించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ‌కు చెందిన డైర‌క్ట‌రేట్ ఆఫ్ పోరెన్సిక్ సైన్ స‌ర్వీసెస్ కింది మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది.

-ఎన్‌.ఎ.బి.ఎల్ ప్ర‌మాణాల ప్ర‌కారం (ఐఎస్ఒ 17025) అక్రిడిటేష‌న్‌కు క్వాలిటీ మాన్యువ‌ల్సు, ఫొరెన్సిక్ సైన్సెస్‌కు చెందిన 8 రంగాల‌కు వ‌ర్కింగ్ ప్రొసీజ‌ర్ మాన్యువ‌ల్స్‌

-బ‌యాల‌జీ, డిఎన్ఎ డివిజ‌న్ల‌కు క్వాలిటీ మాన్యువ‌ళ్లు, వ‌ర్కింగ్ ప్రొసీజ‌ర్లు

-లైంగిక దాడుల కేసుల‌లో ఫోరెన్సిక్ సాక్ష్యాల సేక‌ర‌ణ‌, సంర‌క్ష‌ణ‌, ర‌వాణాకు సంబంధించి ద‌ర్యాప్తు అధికారుల‌, వైద్య అధికారుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు. లైంగిక దాడుల కేసుల‌లో సాక్ష్యాల‌ను త‌గిన విధంగా సేక‌రించి , వాటిని భ‌ద్ర‌ప‌రిచేందుకు, లైంగిక దాడుల కేసుల‌లో సాక్ష్యాల సేక‌ర‌ణ‌కు 15,000కు పైగా కిట్ల‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు పంపిణీ చేయ‌డం జ‌రిగింది.

-ఫోరెన్సిక్ సైన్సు లేబ‌రెట‌రీల స్థాయి పెంపు, లేబ‌రెట‌రీల స్థాప‌న‌కు ప్ర‌మాణాల ప్ర‌కారం ఉండాల్సిన ప‌రిక‌రాల జాబితా.

 కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి ఈరోజు రాజ్య‌స‌భ‌లో ఒక లిఖిత పూర్వ‌క ప్ర‌శ్న‌కు స‌మాధానంగా

ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

***



(Release ID: 1655428) Visitor Counter : 84