హోం మంత్రిత్వ శాఖ
370వ అధికరణం రద్దు చేసిన తరువాతతగ్గిన ఉగ్రవాద సంఘటనలు
Posted On:
16 SEP 2020 3:24PM by PIB Hyderabad
జమ్ము, కశ్మీర్ లో గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీ తరువాత ఉగ్రవాదులకు సంబంధించిన సంఘటనలు చాలా వరకు తగ్గిపోయాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్య సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
2018 లో జూన్ 29వ తేదీ మొదలుకొని 2019 ఆగస్టు నాల్గవ తేదీ మధ్య కాలంలో ఉగ్రవాద సంబంధిత ఘటనలు 455 నమోదవగా, 2019 ఆగస్టు 5 నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు 211 చోటు చేసుకొన్నాయని ఆయన తెలిపారు.
ఉగ్రవాదం పట్ల ప్రభుత్వం ఎంత మాత్రం సహనం చూపని విధానాన్ని అనుసరిస్తూ, వివిధ చర్యలను చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు.
ఆ చర్యలలో భాగంగా భద్రత యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, దేశ వ్యతిరేక శక్తుల విషయంలో చట్టాలను గట్టిగా అమలుపరచడం, రక్షణ వలయాన్ని ముమ్మరం చేయడంతో పాటు, ఉగ్రవాద సంస్థలు రువ్వుతున్న సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడానికి సోదా కార్యకలాపాలను తీవ్రతరం చేయడం వంటివి అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఉగ్రవాదులకు మద్ధతిచ్చేందుకు ప్రయత్నించే వ్యక్తుల పట్ల భద్రతా సంస్థలు నిశిత పర్యవేక్షణ చేపట్టి, వారిపై చర్యలు తీసుకొంటాయని ఆయన స్పష్టం చేశారు.
****
(Release ID: 1655142)
Visitor Counter : 140