హోం మంత్రిత్వ శాఖ

ఎఫ్.సి.ఆర్.ఎ. ఖాతాలు, నిధుల వివరాలు

Posted On: 16 SEP 2020 3:28PM by PIB Hyderabad

   విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్.సి.ఆర్..-2010) కింద దాదాపు 22,400 సంఘాలు/ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు (ఎన్.జి..లు) నమోదై ఉన్నాయి.ఇలా నమోదైన ప్రతి సంఘం, ఎన్.జి.. కనీసం ఒకటిచొప్పున ఎఫ్.ఆర్.సి.. ఖాతాను తమ బ్యాంకులో ప్రారంభించాయి. ఏదైనా సంఘం, లేదా ఎన్.జి.. మరో వినియోగ ఖాతాను కూడా తాను ఎంపిక చేసుకున్న బ్యాంకులో ప్రారంభించుకోవచ్చు. ఇందుకు సంబంధించి రాష్ట్రాలవారీ వివరాలు ఎఫ్.ఆర్.సి.. పోర్టల్ www.fcraonline.nic.in లో అందుబాటులో ఉన్నాయి.

    ఏదైనా ఎన్.జి.. సంస్థ,.. విదేశాలనుంచి నిధులు/విరాళాలు రప్పించుకునేందుకు, వాటిని వినియోగించుకునేందుకు  అవి ఎఫ్.సి.ఆర్. ప్రకారం చట్టబద్ధంగా నమోదై ఉండాలి. లేదా సదరు ఎన్.జి..కు కేంద్ర ప్రభుత్వంనుంచి ముందస్తు అనుమతి అయినా మంజూరై ఉండాలి. చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం ఒక కచ్చితమైన సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, మత, సామాజిక కార్యక్రమ సంబంధమైన అవసరాలకు విదేశీ విరాళాలను తెప్పించుకునేందుకు, వాటిని వినియోగించేందుకు సదరు సంస్థకు వీలుంటుంది. విదేశాలనుంచి అందుకుని, వినియోగించిన విరాళాల వివరాలు ఆయా సంస్థలు, ఎన్.జి..లు సమర్పించిన వార్షిక రిటర్నులలో అందుబాటులో ఉంటాయి. వాటినే ఎఫ్.సి.ఆర్.. పోర్టల్ అయిన www.fcraonline.nic.inలో పొందుపరిచారు.

  ఒకవేళ విదేశీ విరాళం దుర్వినియోమైనట్టుగా తేలినపక్షంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలోని 14 సెక్షన్ ప్రకారం,..సంబంధిత సంఘం లేదా ఎన్.జి.. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను రద్దు చేయడానికి వీలుంటుందిఇందుకు సంబంధించిన కేసు తీవ్రమైనదైన పక్షంలో, ఎలాంటి నేరానికైనా ప్రాథమిక సాక్ష్యాధారాన్ని బట్టి చట్టం పరిధిలో శిక్ష ఉంటుంది. చట్టంలోని సెక్షన్-43 ప్రకారం ఏదైనా దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించే అవకాశం కూడా ఉంది.

  నిధులు దుర్వినియోగమైనట్టుగా గత మూడేళ్లలో తేలిన కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలు కింది విధంగా ఉన్నాయి:-

సంవత్సరం

 

నిధుల దుర్వినియోగంపై ఎఫ్.సి.ఆర్.. రిజిస్ట్రేషన్ ను రద్దు చేసిన సందర్భాలు

విదేశీ విరాళాలు దుర్వినియోగంపై కేసును సి.బి./రాష్ట్ర నేర పరిశోధన శాఖకు అప్పగించిన సందర్భాలు

2017

2

2

2018

లేవు

లేవు

2019

లేవు

1

 

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వివరాలు తెలిపారు.

****



(Release ID: 1655130) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Tamil