ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇంజనీర్ల దినోత్సవాన్నిపాటించిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్
విశ్వేశ్వరయ్య పిహెచ్‌డి పథకం కింద కృత్రిమ మేథపై పనిచేస్తున్న విశ్వేశ్వరయ్య పిహెచ్‌డి ఫెలో లతో ఆన్‌లైన్ సమావేశం
Posted On:
15 SEP 2020 7:24PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్, ఐటికి సంబంధించి విశ్వేశ్వరయ్య పిహెచ్‌డి పథకం కింద కృత్రిమ మేథ, అనలిటిక్స్‌పై పనిచేస్తున్న విశ్వేశ్వరయ్య పిహెచ్‌డి ఫెలోలు , డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఎం.డి, సిఇఒతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం 2020 సెప్టెంబర్ 15న జరిగింది.
విశ్వేశ్వరయ్య పిహెచ్‌డి పథకాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీనిని 2014లో కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. ఇఎస్‌డిఎం, ఐటి, ఐటిఇఎస్ రంగాలలో పిహెచ్‌డిల సంఖ్యను పెంచే లక్ష్యంతో దీనిని ఆమోదించింది. 908 పుల్‌టైమ్, 304 పార్ట్ టైమ్ పిహెచ్‌డి అభ్యర్ధులు, 158మంది వై ఎఫ్ ఆర్ ఎఫ్ లు 97 సంస్థల వద్ద పేర్లునమోదు చేసుకున్నారు.ఇందులో ఐఐటిలు, ఎన్ఐటిలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు తదితరాలు ఉన్నాయి. 170 మంది పిహెచ్‌డి అభ్యర్ధులు తమ పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథాలను పిహెచ్‌డి పోర్టల్‌ద్వారా సమర్పించారు.
కృత్రిమ మేథపైపనిచేస్తున్న 35 మంది పిహెచ్‌డి ఫెలో లను తమ పరిశోధనలను ప్రజెంట్ చేసేందుకు ఎంపికచేశారు. ఈ సమావేశం సందర్భంగా 11 మంది పిహెచ్‌డి ఫెలొ లు తమ పరిశోధన అంశాన్ని ప్రెజెంట్ చేశారు. ఐఐటి ఢిల్లీ నుంచి మయాంక్‌శర్మ, ప్రన్షు జైన్, జె.ఎన్.యు ఢిల్లీ నుంచి హర్ష్ భాసిన్, ఎన్.ఐ.టి అరుణాచల్ ప్రదేశ్ నుంచి సయన్‌సిక్‌దర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌నుంచి ధర్మోస్తు భీక్య, ఆంద్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం నుంచి కె.నారాయణ రావు, జబల్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ మాన్యుఫాక్చరింగ్ కు చెందిన కైలాశ్ వామన్ రావు కలారేలు మెషిన్ లెర్నింగ్ , డీప్ లెర్నింగ్, పార్లల్‌కంప్యూటింగ్, వైర్‌లెస్ సెన్సర్ నెట్‌వర్క్ రిసెర్చి అంశాలలో తమ కృషిని ప్రజెంట్ చేశారు.
ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నంకుచెందిన చామర్తి అనూష, డి.వెంకట సుబ్బయ్యలు యంత్ర మేథ ద్వారా కెమెరా చిత్రం గుర్తింపు, వస్తువు ను కనిపెట్టడానికి సంబఃదించి తమ కృషిని వివరించారు.
ఎన్ ఐటి దుర్గాపూర్ కు చెందిన నారాయణ్ చాంగ్‌డెర్ నోవెల్ ఆల్గరిథమ్స్ ఫర్ మల్టీ ఏజెంట్స్ కొయలిషన్ స్ట్రక్చర్ జనరేషన్ కు సంబంధించి తన కృషిని వివరించారు.
కీర్తి కుమార్ సామాజిక మాద్యమాలలో సైబర్ బెదిరింపులకు కు సంబంధించి ఆటోమేటెడ్ డిటెక్షన్ విషయంలొ తన కృషిని వివరించారు.ఈ పరిశోధనను ఎం.ఇ.ఐ.టి వై అధికారులు గొప్పగా ప్రశంసించారు.
డిఐసి సిఇఒ, మేనేజింగ్ డైరక్టర్ అభిషేక్ సింగ్ ప్రేరణాత్మక ప్రసంగంతో ఈ సెషన్ ముగిసింది. కృత్రిమ మేథ, అనలిటిక్స్ రంగంలో వారి కృషిని అభినందించారు. పరిశోధనలు అడ్వాన్సుడు స్టేజిలో ఉన్న స్కాలర్లను తమ తమ పరిశోధనల ఫలితాలు, సాంకేతికత వాస్తవ పరిస్థితులలో ఉపయోగపడేట్టు చూడాల్సిందిగా సూచించారు. కంప్యుటేషనల్ సామర్ధ్యాలకు సంబంధించి, వివిధ మంత్రిత్వశాఖలతో కొలాబరేషన్, డిపార్టమెంటులు, పరిశోధకులు, నిపుణులు, సరైన డాటాకు సంబంధించి,వారు ఏవైనా సమస్యలు ఎదుర్కుంటుంటే డిఐసి, ఎం.ఇ.ఐ.టి వై ని సంప్రదించాల్సిందిగా సూచించారు.
భారతదేశం ప్రతి ఏడాది సప్టెంబర్ 15 ప్రఖ్యాత ఇంజనీరు భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్ల దినోత్సవం నిర్వహిస్తుంది. శ్రీవిశ్వేశ్వరయ్య భారత దేశ విఖ్యాత ఇంజనీరు. ఆయన సమాజానికి చేసిన అద్భుత సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1955 వ సంవత్సరంలో ఆయనను భారత రత్న పురస్కారంతో సత్కరించింది.
***
(Release ID: 1655075)
Visitor Counter : 108