గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఉపాధి హామీ పథకం కింద పెరిగిన ఉపాధి

Posted On: 15 SEP 2020 7:34PM by PIB Hyderabad

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వ్యక్తుల ఉపాధి అవసరాల వివరాలు ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 12 వరకు ఇలా ఉన్నాయి:

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీకింద సెప్టెంబర్ 12,2020 వరకు డిమాండ్

ఆర్థిక సంవత్సరం

ఏప్రిల్

మే

జూన్

జులై

ఆగస్టు

సెప్టెంబర్ 12,2020

సెప్టెంబర్

12,2020 వరకు మొత్తం డిమాండ్

2020-21

1,90,11,940

5,20,97,876

6,20,66,691

4,25,79,581

3,14,35,525

1,77,15,391

22,49,07,004

2019-20

3,06,11,584

3,59,74,776

3,56,51,034

2,40,65,189

1,81,40,113

1,75,95,676

16,20,38,372

పెరుగుదల %

38.79

 

2020-21 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 12 వరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి లబ్ధి పొందినవారి సంఖ్య 8.29 కోట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 61,500 కోట్లు పని జరగగా అందులో ఇప్పటిదాకా రూ. 60,599 కోట్లు విడుదలయ్యాయి. ఆర్థికమంత్రి ప్రకటించినా ఆత్మనిర్భర్ పాకేజ్ కింద ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం అదనంగా రూ. 40,000  కోట్ల నిధులు ఏర్పాటు చేసింది.

ఈ పథకం కింద కొత్త పనులు చేర్చటమన్నది ఎప్పటికప్పుడు క్రమం తప్పకుందా సాగే కార్యక్రమం. దీనికిందికి మరిన్ని పనులు వచ్చి చేరుతుంటాయి.ఈ క్రమంలోనే 2.7.2020 నాడు ఈ పథకం కిందికి వచ్చే పనుల సంఖ్యను 262 కు చేర్చారు. నైపుణ్యం అవసరంలేని 230 పనిదినాలతో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీన) కింద సామూహిల పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణం కూడా కలిపారు.

ఇతర మంత్రిత్వశాఖలు, విభాగాలతో కలిసి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కన్వర్జెన్స్ మార్గదర్శకాలు కూడా జారీచేస్తుంది. దీనివలన దీర్ఘకాలం మన్నే ఆస్తుల సృష్టి జరుగుతుంది.  గ్రామీణ ప్రాంతాలలో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. ఇటీవల ఈ క్రింద పేర్కొన్న మార్గదర్శకాలు జారీఅయ్యాయి:

వివిధ విభాగాల కార్యదర్శుల ఉమ్మడి సంతకాలతో 24.04.2020 న డివో లెటర్ ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు పంపారు. దేశంలో నీటి సంరక్షణ, నీటి నిర్వహణ లాంటి అంశాలమీద సానుకూల ప్రభావం చూపగలిగేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఇప్పటికే ఉన్న నీటి వనరులను పరిరక్షించటం, భూగర్భ జలాల రీఛార్జ్, వర్షపు నీటి నిల్వ, సంప్రదాయ నీటి నిల్వలను, వాగులను ప్రోత్సహించటం అందులో భాగాలు. ఈ కార్యకలాపాల వలన గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సుస్థిరత ఏర్పడి ప్రస్తుతం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ పటిష్టమవుతుంది.

వ్యక్తిగత లబ్ధిదారులకు, సమూహాలకు ఎన్ ఆర్ ఎల్ ఎం కింద రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కన్వర్జెన్స్ సాధించేలా న్యూట్రి గార్డెన్ ను ప్రోత్సహిస్తూ  04.05.2020  తేదీతో మార్గదర్శకాల జారీ

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణానికి 10.06.2020 న ఉమ్మడి మార్గదర్శకాల జారీ

పశుగణాభివృద్ధి, పాడి విభాగంతో కలిసి పశుగ్రాస పొలాల అభివృద్ధికి 26.06.2020 న ఉమ్మడి మార్గదర్శకాల జారీ

జాతీయ ఔషధ మొక్కల బోర్డు, ఆయుష్ మంత్రిత్వశాఖ, డి ఆర్ డి వో కలిసి ఔషధ మొక్కలను అభివృద్ధి పరచటానికి  11.08.2020 న ఉమ్మడి మార్గదర్శకాల జారీ

ఈ సమాచారాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు లోక్ సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పొందుపరచారు

***


(Release ID: 1654894) Visitor Counter : 404


Read this release in: English , Bengali , Punjabi