గనుల మంత్రిత్వ శాఖ

ప్రతిపాదిత మైనింగ్ సంస్కరణలపై ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో సూచనలు అందాయి.

Posted On: 15 SEP 2020 6:32PM by PIB Hyderabad

అక్రమ మైనింగ్‌ను చట్టబద్ధం చేసే ప్రతిపాదన లేదు.  ఈ రోజు గనుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.  గనుల మంత్రిత్వ శాఖ, గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) (ఎమ్.ఎమ్.డి.ఆర్) చట్టం, 1957 లో  ప్రతిపాదిత సంస్కరణలను, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి విమర్శలు / సలహాల కోసం పంపిణీ చేసింది.

దీనితో పాటు, ప్రతిపాదిత సంస్కరణలకు విస్తృత ప్రచారం కపించడానికీ, చట్టం ఖరారు చేసే ముందు సంప్రదింపులు చేయాలనే విధానం ప్రకారం, మంత్రిత్వ శాఖ 24.08.2020 తేదీ నాటి నోటీసుతో పాటు గనుల మంత్రిత్వ శాఖ వెబ్ ‌సైట్ ‌లో ప్రతిపాదనల నిబంధనలను వివరించే ఒక నోటీసును, సాధారణ ప్రజలు, గనుల పరిశ్రమ, భాగస్వాములు, పరిశ్రమ సంఘాలతో పాటు ఇతర వ్యక్తులు మరియు సంస్థల నుండి విమర్శలు, సలహాలను కోరడం కోసం  అందుబాటులో ఉంచింది. 

ప్రజలతో సంప్రదించాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన నోటీసుకు ప్రతిస్పందనగా ప్రతిపాదిత సంస్కరణలపై పెద్ద సంఖ్యలో వ్యాఖ్యలు / సూచనలు మంత్రిత్వ శాఖకు వచ్చాయి, ఇప్పుడు వీటిని వివరంగా పరిశీలిస్తున్నారు.

ఖనిజ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెంపొందించడానికీ, గనుల రంగంలో సంస్కరణలను తీసుకురావడానికీ, ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద 2020 మే నెల, 16వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి ఒక ప్రకటన చేశారు.  ఆ ప్రకటనలను అమలు చేయడానికి, గనుల మంత్రిత్వ శాఖ,  గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) (ఎమ్.ఎమ్.డి.ఆర్) చట్టం, 1957 కు శాసన పరమైన సవరణలను ప్రతిపాదించింది.  వృద్ధి మరియు ఉపాధి తరాలను వేగవంతం చేయడం మరియు కోవిడ్-19 మహమ్మారి యొక్క మందగించే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచే లక్ష్యంతో ఖనిజ రంగంలో ఈ నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టడం కోసం, ఈ సవరణలను ప్రతిపాదించడం జరిగింది. 

ఈ ప్రతిపాదనల్లో (i) ఖనిజ బ్లాకుల వేలం కోసం అన్వేషణ నిబంధనలను పునర్నిర్వచించడం ద్వారా ఖనిజ ఉత్పత్తి మరియు ఉపాధి ఉత్పత్తిని పెంచడం మరియు అన్వేషణ నుండి ఉత్పత్తికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడడం (ii) ఖనిజ వనరుల కేటాయింపు కోసం వేలం మాత్రమే నిర్వహించి, వారసత్వ సమస్యలను పరిష్కరించడం;  (iii)  క్యాప్టివ్ మరియు క్యాప్టివ్ కాని గనుల మధ్య వ్యత్యాసాన్ని తొలగించడం;  (iv)  పారదర్శక జాతీయ ఖనిజ సూచికను అభివృద్ధి చేయడం; మొదలైన అంశాలు ఉన్నాయి. 

 

*****



(Release ID: 1654865) Visitor Counter : 125


Read this release in: English , Hindi