గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ సంక్షోభంలో ఉపాధిహామీ పథకం అమలు

Posted On: 15 SEP 2020 7:34PM by PIB Hyderabad

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సకాలంలో వేతన ఉపాధి కల్పించే పథకం. గ్రామీణ ప్రాంతాల్లో జాబ్ కార్డ్ ఉన్న ప్రతి వయోజనుడికీ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ప్రకారం) ఈ పథకం కింద ఉపాధి కల్పించవలసిందిగా డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. ఈ జాబ్ కార్డ్ లో వలస కార్ముకుడు అనిగాని, వలస కుటుంబం అని గాని వర్గీకరించే వీలు లేదు.  వలస కూలీ లేదా కుటుంబం అయినా సరే అలాంటి వారికి జాబ్ కార్డు జారీచేయవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 86,81,928 కొత్త జాబ్ కార్డులు జారీచేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2019-20లో జారీచేసిన కొత్త జాబ్ కార్డుల సంఖ్య 64,95,823. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద రాష్ట్రాలవారీగా ఏప్రిల్ 2020 నుంచి ఆగస్టు, 2020 వరకు విడుదల చేసిన/ఖర్చు చేసిన నిధుల వివరాలు అనుబంధం-I లో ఉన్నాయి.

హామీ ఇచ్చిన ఉపాధి దినాల పెంపు విషయానికొస్తే, గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం అవసరంలేని శారీరక శ్రమ చేయటానికి ముందుకొచ్చే  వయోజనుడు ఉన్న ప్రతి ఇంటికీ ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల వేతనపు ఉపాధికి హామీ ఉంటుంది. ఇదే కాకుండా నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో కరవు, ప్రకృతివైపరీత్యం లాంటివి వచ్చిన సందర్భాల్లో అదనంగా మరో 50 రోజులపాటు నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమ చేయటానికి ఉపాధి హామీ లభిస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం, 2005 లోని సెక్షన్  3(4) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పేర్కొన్న రోజులకు మించి కూడా తన సొంత నిధులతో అదనపు రోజులు ఉపాధి కల్పించవచ్చు.

2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలతోబాటు 2020-21  సంవత్సరం (ఏప్రిల్  2020 నుంచి ఆగస్టు 2020 వరకు) గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రాలవారీగా విడుదలచేసిన/వెచ్చించిన నిధుల వివరాలు అనుబంధం-II లో ఉన్నాయి.

ఉపాధి కల్పించిన ఇళ్ళ వివరాలు అనుబంధం - III(a) లో ఉన్నాయి. అలా కల్పించిన మానవ దినాలు అనుబంధం-III(b) లో ఉన్నాయి. అందులోనే 2020 మార్చి-ఆగస్టు మధ్య కాలానికి సంబంధించిన సమాచారం, అదే కాలంలో అంతకుముందు 2019 నాటి సమాచారం ఉన్నాయి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం, 2005 లోని సెక్షన్  6(1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా దాని లబ్ధిదారులకు వేతన వివరాలు ప్రకటించవచ్చు. దీనికి అనుగుణంగానే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఏటా రాష్ట్రాలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతన వివరాలు తెలియజేస్తుంది. ద్రవ్యోల్బణం వలన ఏర్పడే లోటును వేతనాలలో భర్తీ చేయటానికి వ్యవసాయ కూలీలకు వినియోగదారు ధరల సూచి ఆధారంగా గ్రామీణ మంత్రిత్వశాఖ ఏటా ఈ వేతనంలో మార్పు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు అమలులోకి వస్తాయి. అయితే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంతకంటే ఎక్కువగా ఇవ్వదలచుకుంటే ఇవ్వటానికి కూడా వీలుంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన వేతనాలను 2020  మార్చి 23 న నోటిఫై చేయగా ఆ వివరాలు అనుబంధం-IV లో ఉన్నాయి.

చట్టంలోని సెక్షన్ 6(1)  కి అనుగుణంగా ఉపాధి హామీ పథకం వేతనాలు నిర్ణయిస్తారు. ఈ శాఖ వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న కనీస వేతనాలను కేంద్రీయంగా  అమలు చేయదు.

కేంద్ర ప్రభుత్వం,  రాష్ట్రప్రభుత్వాల చురుకైన మద్దతుతో ఇప్పటిదాకా తగినన్ని నిధులు సమకూర్చటం ద్వారా డిమాండ్ కు తగినట్టు వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.09.2020 నాటికి మంత్రిత్వశాఖ రూ.  60,44,098.23  లక్షలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ పథకం అమలుకోసం విడుదలచేసింది. 2019 , 2020  సంవత్సరాలలో ఆయా నెలలకు మానవ దినాల కల్పనలో పోలికలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

***



(Release ID: 1654863) Visitor Counter : 446


Read this release in: English , Manipuri , Punjabi