సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఏఎస్‌ఐ స్మారక కట్టడాల్లో చిత్రీకరణలకు ఆన్‌లైన్‌ ద్వారానే అన్ని అనుమతులు: శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌

Posted On: 15 SEP 2020 6:17PM by PIB Hyderabad

చిత్రీకరణ అనుమతులన్నీ ఆన్‌లైన్ ద్వారానే లభించాయి. దరఖాస్తుదారులు, వివరాలతోపాటు అవసరమైన అన్ని పత్రాలను 'ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా' (ఏఎస్‌ఐ) పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. దరఖాస్తు స్వీకరించాక, తక్షణం పరిశీలన జరిపి, సాధ్యమైనంత తక్కువ సమయంలోనే అనుమతుల మంజూరు జరిగింది. దీనికితోడు, ఏఎస్‌ఐ ఆన్‌లైన్‌ దరఖాస్తు వ్యవస్థ; సమాచార&ప్రసార మంత్రిత్వ శాఖతోను, జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌ఎఫ్‌డీసీ)కి చెందిన 'ఫిల్మ్‌ ఫెసిలిటేషన్‌ ఆఫీస్‌' (ఎఫ్‌ఎఫ్‌వో) వెబ్‌సైట్‌ www.ffo.gov.in తోను అనుసంధానమై ఉంది. ఎఫ్‌ఎఫ్‌లో వెబ్ పోర్టల్‌లో ఖాతాను తెరవడం ద్వారా, ఏఎస్‌ఐ యాజమాన్యంలోని స్మారక కట్టడాలలో చిత్రీకరణలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి చిత్ర నిర్మాతలను ఇది అనుమతిస్తుంది. అనుమతి ప్రక్రియను మరింత సమర్థవంతంగా, త్వరగా పూర్తయ్యేలా చేసే ఏక గవాక్ష వ్యవస్థ ఇది.

    సంస్కృతి, పర్యాటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.

***


(Release ID: 1654752)
Read this release in: English , Bengali