హోం మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ మీద ఎన్ డి ఎం ఎ మార్గదర్శకాలు

Posted On: 15 SEP 2020 6:01PM by PIB Hyderabad

విపత్తుల నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 6 (2) (i)  ప్రకారం జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్ డి ఎం ఎ) కోవిడ్- 19 మహమ్మారి దేశానికి ప్రమాదకరమని నమ్మిన మీదట జాతీయ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడైన కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శిని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగాను, దేశంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అవసరమైన మార్గదర్శకాలు జారీచేయవలసిందిగాను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా  జాతీయ కార్యనిర్వాహక కమిటీ లాక్ డౌన్ కు సంబంధించిన నిబంధనలను జారీచేస్తూ ఎప్పటికప్పుడు దేశంలో దశలవారీ సడలింపులకు కూడా మార్గదర్శకాలు ఇస్తూ వచ్చింది.  

దేశవ్యాప్త లాక్ డౌన్ విధించటం ద్వారా కోవిడ్-19 తీవ్రమైన వ్యాప్తిని  భారత్ విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఈ లాక్ డౌన్ సమయం అవసరమైన అదనపు ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించుకోవటానికి భారత దేశానికి బాగా సహాయకారి అయింది. ఈ సమయంలోనే ప్రత్యేకమైన ఐసొలేషన్ పడకల సంఖ్య రికార్డు స్థాయిలో 22 రెట్లు పెరిగింది. ఐసియు పడకల సంఖ్య 2020 మార్చి నాటి స్థితితో పోల్చుకుంటే 14 రెట్లు పెరిగింది. అదే విధంగా పరీక్షలు జరిపే లాబ్ ల సంఖ్య ఈ సమయంలో దాదాపు పది రెట్లు పెరిగింది. వ్యక్తిగత రక్షణకోసం వినియోగించే పిపిఇ కిట్లు తగిన ప్రమాణాలతో తయారు చేసుకోవటానికి స్వదేశీ తయారీ సంస్థలేవీ లేని పరిస్థితి ఉండగా ఇప్పుడు ఇప్పుడు దేశం స్వయం సమృద్ధం కావటమే కాకుండా ఎగుమతి చేయగలిగే స్థితిలో ఉంది. అదే విధంగా పరిమితంగా ఉన్న  మాస్కుల, వెంటిలేటర్ల తయారీ సామర్థ్యం లాక్ డౌన్ సమయంలో ఉన్నప్పటితో పోల్చుకుంటే ఎంతో పెరిగి ఇప్పుడు ఇందులో స్వయం సమృద్ధ స్థాయికి చేరింది. ఇదే సమయంలో వివిధ విభాగాలలో వివిధ స్థాయి సిబ్బంది, వాలంటీర్లు కోవిడ్ సంబంధ సేవలకోసం, నిత్యావసరాలు, వైద్య సేవలకోసం అవసరమయ్యారు. ఆ అవసరాలకు తగినట్టుగా సమకూర్చి శిక్షణ ఇవ్వటానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్ సైట్ ఎంతగానో ఉపయోగపడింది. దీంతోబాటు ఆన్ లైన్ వేదిక ఐగాట్ (https://igot.gov.in/igot/) కూడా అందుబాటులోకి వచ్చింది. లాక్ డౌన్ నిర్ణయం ఫలితంగా భారత్ లో వ్యాధి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకొని దాదాపు 14–29 లక్షల కేసులను, 37–78  వేల మరణాలను అరికట్టగలిగినట్టు ఒక అంచనా.

కోవిడ్-19 ప్రభావాన్ని అడ్డుకోవటానికి, నియంత్రించటానికి, తగ్గించటానికి భారత ప్రభుత్వంఅనేక సమగ్రమైన కార్యక్రమాలు చేపట్టింది. గౌరవ ప్రధానమంత్రి, ఉన్నత స్థాయి మంత్రుల బృందం, కాబినెట్ కార్యదర్శి, కార్యదర్శుల కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వశాఖలోని సీనియర్ అధికారులు, ఎన్ డి ఎం ఎ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ఇతర మంత్రిత్వశాఖలు, సంబంధిత విభాగాలు దేశంలో కోవిడ్-19 కు ప్రజారోగ్య స్పందనను పర్యవేక్షిస్తూ రావటం గమనార్హం.

జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్ డి ఎం ఎ) సిఫార్సులకు అనుగుణంగా జాతీయ కార్యనిర్వాహక సంఘం జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాలలో వ్యాధి నియంత్రణకు స్వేచ్ఛగా చర్యలు తీసుకోవటానికి వీలుకల్పించారు. 

హోమ్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం

***



(Release ID: 1654750) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Manipuri