రైల్వే మంత్రిత్వ శాఖ

పాల్వాల్ నుండి సోహ్నా-మనేసర్- ఖార్ఖౌడా మీదుగా సోనిపట్ వరకు హర్యానా ఆర్బిటల్ రైల్ కారిడార్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రాజెక్ట్ మొత్తం పొడవు ~ 121.7 కి.మీ.

హర్యానా ప్రభుత్వంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌ఐడిసి) ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది.

ఇది ఢిల్లీకి ఉద్దేశించని ట్రాఫిక్ మళ్లింపును సులభతరం చేస్తుంది, ఎన్‌సిఆర్ కి చెందిన హర్యానా రాష్ట్ర సబ్ రీజియన్ ‌లో మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

ప్రాజెక్ట్ పూర్తి అంచనా వ్యయం ~ రూ. 5,617 కోట్లు, 5 సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రతిపాదించారు

Posted On: 15 SEP 2020 2:26PM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ  పాల్వాల్ నుండి సోహ్నా-మనేసర్- ఖార్ఖౌడా మీదుగా సోనిపట్ వరకు హర్యానా ఆర్బిటల్ రైల్ కారిడార్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. ఈ రైలు మార్గం పాల్వాల్ నుండి ప్రారంభమై ప్రస్తుత హర్సానా కలాన్ స్టేషన్ (ఢిల్లీ -అంబాలా సెక్షన్) వద్ద ముగుస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న పట్లి స్టేషన్ (ఢిల్లీ-రేవారి లైన్), సుల్తాన్‌పూర్ స్టేషన్ (గర్హి హర్సారు-ఫరూఖ్‌నగర్ లైన్‌లో), అసౌధా స్టేషన్ (ఢిల్లీ రోహ్తక్ లైన్‌లో) కు కనెక్టివిటీని ఇస్తుంది.

అమలు: 

హర్యానా ప్రభుత్వంతో రైల్వే మంత్రిత్వ శాఖ జాయింట్ వెంచర్ హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌ఐడిసి) ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ, హర్యానా ప్రభుత్వం, ప్రైవేట్ వాటాదారుల సంయుక్త భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తి ఖర్చు రూ. 5,617 కోట్లు. ఈ ప్రాజెక్టు 5 సంవత్సరాలలో పూర్తయ్యే అవకాశం ఉంది.

ప్రయోజనాలు:

హర్యానాలోని పాల్వాల్, నుహ్, గురుగ్రామ్,ఝజ్జార్, సోనిపట్ జిల్లాలకు ఈ రైలు మార్గం ద్వారా లబ్ధి చేకూరుతుంది. 

ఇది ఢిల్లీకి ఉద్దేశించని ట్రాఫిక్ మళ్లింపును సులభతరం చేస్తుంది, తద్వారా ఎన్‌సిఆర్‌ను రద్దీని సుగమం చేస్తుంది. ఎన్‌సిఆర్ కింద హర్యానా రాష్ట్ర ఉప ప్రాంతంలోని మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది ఈ ప్రాంతం యొక్క హై-స్పీడ్ నిరాటంకమైన కనెక్టివిటీని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్‌వర్క్‌కు అందిస్తుంది, దీని ఫలితంగా ఎన్‌సిఆర్ నుండి దేశంలోని వివిధ ఓడరేవులకు ఎక్సిమ్ ట్రాఫిక్ కోసం ఖర్చు, రవాణా సమయం తగ్గుతుంది, వస్తువుల ఎగుమతులను మరింత పోటీ పెంచుతాయి. ఈ సమర్థవంతమైన రవాణా కారిడార్ ఇతర కార్యక్రమాలతో పాటు 'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌ను నెరవేర్చడానికి, తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి, బహుళజాతి పరిశ్రమలను ఆకర్షించడానికి మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ హర్యానా రాష్ట్రంలోని ఇప్పటివరకు ఇటువంటి రవాణా సేవలకు దూరంగా ఉన్న ప్రాంతాలను అనుసంధానిస్తుంది, తద్వారా హర్యానా రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఈ బహుళార్ధసాధక రవాణా ప్రాజెక్టు అందుబాటు ధరల్లో వేగవంతమైన ప్రయాణికుల ప్రయాణం, గురుగ్రామ్, పారిశ్రామిక ప్రాంతాలైన మానేసర్, సోహ్నా, ఫరూఖ్ నగర్, ఖార్ఖౌడా సోనిపట్ నుండి వేర్వేరు దిశల్లో సుదూర ప్రయాణానికి కూడా దోహదపడుతుంది. ప్రతిరోజూ సుమారు 20,000 మంది ప్రయాణికులు ఈ లైన్ ద్వారా ప్రయాణించనున్నారు, ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నుల సరకు రవాణా కూడా జరుగుతుంది.

నేపథ్యం:

ఢిల్లీని దాటి పాల్వాల్ నుండి సోనిపట్ వరకు ఆర్బిటల్ రైల్ కారిడార్ జాతీయ రాజధాని ప్రాంతం సుస్థిరమైన అభివృద్ధికి, ఢిల్లీ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భారత రైల్వే నెట్‌వర్క్‌ మార్గాన్ని సుగమం చేసే కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ అమరిక పశ్చిమ పరిథి (కుండ్లి-మానేసర్-పాల్వాల్) ఎక్స్‌ప్రెస్‌వేకు ఆనుకొని ఉంది. ఈ ప్రతిపాదన కొంతకాలంగా పరిశీలనలో ఉంది. ఢిల్లీ నుండి బయల్దేరి, హర్యానా రాష్ట్రం గుండా వెళుతున్న అన్ని రైల్వే మార్గాలతో పాటు ప్రత్యేకించిన సరకు రవాణా కారిడార్ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుంది. 

 

*****(Release ID: 1654479) Visitor Counter : 13