యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కోవిడ్ నేపథ్యంలో క్రీడాకారుల శిక్షణకు చర్యలు
Posted On:
14 SEP 2020 6:04PM by PIB Hyderabad
కోవిడ్ సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్రీడా ప్రోత్సాహక పథకాల కింద నిర్వహించే అన్ని రకాల సంప్రదాయ క్రీడా శిక్షణాకార్యక్రమాలనూ తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. విదేశీ కోచ్ ల సాయంతో భారతీయ క్రీదాకారులకు ఇప్పించే శిక్షణ కూదా తగ్గించాల్సి వచ్చింది. ఆధునిక క్రీడల చరిత్రలో మొట్టమొదటి సారిగా 2020 ఒలంపిక్స్, పారాలింపిక్స్ కూడా వాయిదాపడ్దాయి. అయితే, హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా శిక్షణ ఇప్పుడు పునరుద్ధించబడింది.
కోవిడ్ కారణ్ంగా క్రీడాకారుల శిక్షణకు అవరోధం ఏర్పడకుండా ఈ దిగువ పేర్కొన్న చర్యలు తీసుకున్నారు. జపాన్ లోని టోక్యో నగరంలో 2021లో జరిగే ఒలంపిక్ క్రీడలకోసం క్వాలిఫై అయినవారితో సహా పలువురికి శిక్షణ ఇప్పుడు పునరుద్ధరించారు. దీనివలన వారి ప్రతిభకు ఎలాంటి ఆటంకమూ కలుగదు. క్రమంతప్పకుండా అథ్లెట్లకు వారి కోచ్ ల ద్వారా ఆన్ లైన్ శిక్షణ ఇప్పించటం ద్వారా వారిని ప్రేరేపించి ప్రోత్సహించటం సాధ్యమవుతోంది. లాక్ డౌన్ సమయంలో కూడా ఫిట్ నెస్ కోల్పోకుండా ఉండటానికి ఈ శిక్షణ ఉపయోగపడింది. ఆ విధంగా ప్రతిరోజూ వారికోసం రూపొందించిన ప్రాక్టీస్ మాడ్యూల్స్ ను అనుసరించారు.
క్రీడాకారుల నైతిక స్థైర్యం పెంచుతూ ప్రతిరోజూ వారితో క్రమం తప్పకుండా సంభాషించే ఏర్పాటు చేశారు. ఈ కష్టకాలంలోనూ వారు మనోధైర్యం కోల్పోకుండా ఉండటానికి అది దోహదం చేసింది. క్రీడా సంబంధమైన మనో విజ్ఞాన శాస్త్ర నిపుణులతో, స్పోర్ట్స్ సైన్స్ నిపుణులు, వైద్య నిపుణులు, పౌష్ఠికాహార నిపుణులతో సెమినార్లు, వర్క్ షాపులు నిర్వహించారు. క్రీడావాతావరణం మధ్య అత్యుత్తమ ప్రతిభ కనబరచటానికి అనువైన విధానాలు, మాదకద్రవ్యాలవాడకానికి వ్యతిరేకంగా వీడియో కాన్ఫరెన్స్ లు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ప్రచారం కొనసాగించారు. ఇలాంటి సమయాల్లో వత్తిడిని ఎదుర్కోవటం మీద అవగాహన కల్పిస్తూ, శిక్షణకు ఎలాంటి అవరోధమూ కలగని భావన వాళ్లలో నింపగలిగారు.
క్రీడాకారులు, కోచ్ విద్యా కార్యక్రమం, కోచ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించి విదేశీ కోచ్ ల చేత, క్రీడా నిపుణుల చేత వివిధ క్రీడాంశాలమీద ప్రసంగాలు ఇప్పించారు. మొత్తం 10483 మంది కోచ్ లు వివిధ క్రీడాంశాలమీద, 3818మంది కోచ్ లు స్పోర్ట్స్ సైన్స్ మీద సెషన్లలో పాల్గొన్నారు. క్రీడాకారులకు అవసరమైన క్రీడాపరికరాలను అందజేసి వారు ఫిట్ గా ఉండేట్టు చూశారు. ఒలంపిక్స్ లో పాల్గొనాల్సినవారు లాక్ డౌన్ కారణంగా శిక్షణాశిబిరాలనుంచి సొంత ఊళ్ళకు తిరిగి వెళ్లలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి గదుల్లోనే పరికరాలు అందజేసి అక్కడే ఫిట్ నెస్ కొనసాగించగలిగేట్టు చూశారు.
జాతీయ శిక్షణా శిబిరాలు: 2021 ఒలంపిక్స్ లొ పాల్గొనాల్సి ఉన్న క్రీడాకారులకు జాతీయ శిక్షణా శిబిరాలలో శిక్షణ పునరుద్ధరించారు. ప్రామాణిక నిర్వహణావిధానాలకు లోబడి సురక్షితమైన పద్ధతులలో శిక్షణ ఇచ్చారు. కోవిడ్ మీద అవగాహన పెంచేందుకు, సాఫ్ట్ స్కిల్స్ మీద కూడా ఈ క్రీడాకారులకు వారం రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయమంత్రి ( స్వతంత్ర ప్రతిపత్తి) శ్రీ కిరెన్ రిజిజు ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.
***
(Release ID: 1654300)
Visitor Counter : 145