విద్యుత్తు మంత్రిత్వ శాఖ

'మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్' ద్వారా ఆదాయ సముపార్జనకు 'పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్'కు కేంద్రం అనుమతి

Posted On: 08 SEP 2020 7:39PM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన, ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ క్రింది అంశాలకు ఆమోదం తెలిపింది.

i. మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్‌ (ఇన్విట్‌) ద్వారా, ప్రస్తుత స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)లో ఉన్న 'టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్' (టీబీసీబీ) ఆస్తుల ద్వారా 'పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (పవర్‌గ్రిడ్‌) ఆదాయం ఆర్జించడానికి అనుమతి
ii. కేంద్ర ఆదేశాలు, నిర్దేశించిన లక్ష్యాలను అనుసరించి, నిర్మాణంలో ఉన్న లేదా భవిష్యత్తులో సంస్థ సంపాదించే ఆస్తులు సహా ఇతర టీబీసీబీ ద్వారా ఆదాయ ఆర్జనకు అనుమతి
iii. (i), (ii) లో పేర్కొన్న పవర్‌గ్రిడ్‌ ఎస్‌పీవీల సీపీఎస్ఈలో మార్పులకు అనుమతి

వివరాలు: 
    గుర్తించిన టీబీసీబీ ఆస్తులపై ఇన్విట్ ద్వారా ఆదాయం పొందడం పవర్‌గ్రిడ్‌కు ఉపయోగకరం. తద్వారా వచ్చే ఆదాయాన్ని పంపిణీ నెట్‌వర్క్‌ విస్తరణలో కొత్త పెట్టుబడులుగా, సంస్థ పథకాల్లో మూలధనంగా ఉపయోగించవచ్చు. 2019 సెప్టెంబర్‌ నాటి పరిస్థితి ప్రకారం, మొత్తం రూ.7,164 కోట్ల విలువైన బ్లాక్‌లో, మొదటి బ్లాక్‌లో ఐదు టీబీసీబీ ఆస్తుల ద్వారా పవర్‌గ్రిడ్‌ ఆదాయ ఆర్జన చేయగలదు.

ప్రయోజనాలు:
    ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మూలధనంగా, కొత్త పెట్టుబడులుగా పెట్టడం వల్ల సంస్థ నికర విలువ పెరుగుతుంది. పవర్‌గ్రిడ్‌లో ప్రస్తుతం ఉన్న మానవ వనరుల ద్వారానే ఆదాయ ఆర్జన చేపట్టవచ్చు. కొత్తగా సిబ్బంది నియామకాలు అవసరం లేదు. మర్చంట్ బ్యాంకింగ్, న్యాయ సలహాలు, ధర్మకర్తృత్వం‌, ఆర్థిక సలహాలు, విలువ నిర్ధరణ, ముద్రణ, ప్రచారం, అనుబంధ కార్యకలాపాలలో అదనపు ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

పూర్వరంగం:
    అభివృద్ధికి బాటలు వేసే పెట్టుబడులకు 2019-20 బడ్జెట్ ప్రాధాన్యతనిచ్చింది. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెంచడానికి, 'బ్రౌన్ ఫీల్డ్ అసెట్‌ మోనటైజేషన్' వ్యూహంలో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులతో సహా కొత్త ఆర్థిక వ్యవస్థలను ప్రారంభించినట్లు సూచించింది.

    కేంద్ర విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే పవర్‌గ్రిడ్‌, 1992-93లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తతం మహారత్న హోదాలో ఉంది. తన అనుబంధ సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా వ్యాపారం చేస్తోంది.

వ్యూహం అమలు, లక్ష్యాలు: 
    2020-21లో, మొదటి బ్లాక్‌లో, అర్హత గల టీబీసీబీ ఎస్‌పీవీల ద్వారా ఆదాయ ఆర్జన పవర్‌గ్రిడ్‌ తొలి లక్ష్యం. 
ఈ అనుభవంతోపాటు కేంద్ర ఆదేశాలు, నిర్దేశించిన లక్ష్యాలను అనుసరించి, ఆదాయ ఆర్జనకు మరిన్ని అడుగులు వేస్తుంది.

***


(Release ID: 1652504)