భారత ఎన్నికల సంఘం

ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ కు లాంఛనంగా స్వాగతం పలికిన ఎన్నికల కమిషన్

Posted On: 03 SEP 2020 6:43PM by PIB Hyderabad

కొత్తగా ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీ రాజీవ్ కుమార్ కు ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ సునీల్ అరోరా, మరో ఎన్నికల కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర ఈ రోజు సమావేశం సందర్భంగా లాంఛనంగా స్వాగతం పలికారు. సెక్రెటరీ జనరల్ శ్రీ ఉమేశ్ సిన్హా, డిఇసి లు, డైరెక్టర్లు, సీనియర్ ప్రిన్సిపల్ కార్యదర్శులు తదితర అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 శ్రీ రాజీవ్ కుమార్ కు స్వాగతం పలుకుతూ బాంకింగ్, ఫైనాన్స్ సహా వివిధ రంగాలలో ఆయనకున్న అపారమైన అనుభవాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ గుర్తు చేశారు. ఇంతకుముందు చేపట్టిన అధికార హోదాలలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. ఆయన అనుభవం ఎన్నికల సంఘానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూదా ఆయనతో కలసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

ఎన్నికల కమిషన్ ఒక విశిష్టమైన కుటుంబమని అభివర్ణిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుమ్చి ఎప్పటికప్పుడు నిరాటంకంగా మద్దతు అందుకుంటూ సాఫీగా ఎన్నికల నిర్వహణ చేపడుతుందన్నారు. అదే సమయంలో తన ప్రత్యేకమైన ఉనికిని కాపాడుకోవటం కూడా అందరికీ తెలుసునన్నారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చటంలో, దాని పీఠికకు అనుగుణమ్గా నడుచుకోవటంలో  కమిషన్ అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకోవటం ద్వారా మెరుగైన సేవలు అందించగలుగుతున్నామన్నారు.

తనను ఆపాయాయంగా ఆహ్వానించి స్వాగతం పలికిన ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ అరోరాకు, ఎన్నికల కమిషనర్ శ్రీ చంద్రకు శ్రీ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్వాగతం పలికిన ఎన్నికల్ కమిషన్ అధికారులకు, సిబ్బందికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కమిషన్ గౌరవాన్ని, హుందాతనాన్ని, స్వతంత్రతను కాపాడటానికి కృషిచేస్తానన్నారు.

***


(Release ID: 1651153)