ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇండోర్ ఎంజిఎంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి బ్లాక్ ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్

ఆరోగ్యవంతమైన దేశంకోసం వాజ్ పేయ్

ముందు చూపును ప్రశంసించినడాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 28 AUG 2020 5:54PM by PIB Hyderabad

ఇండోర్ లోని మహాత్మా గాంధీ స్మారక కళాశాలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ను ఈ రోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు.  డిజిటల్ పద్ధతిలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే కూడా పాల్గొన్నారు. ఈ వైద్య కళాశాల ఎన్ సి డి సి సేరో సర్వేకి నోడల ఏజెన్సీ కూదా కావటం గమనార్హం. ఆ నివేదికను ఈ రోజు విడుదల చేశారు.


ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద రూ. 237 కోట్ల పెట్టుబడితో ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మించారు. ఇందులో న్యూరాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, మెడికల్ గాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గాస్ట్రో ఎంటరాలజీ , ప్లాస్టిక్ సర్జరీ, అవయవమార్పిడి విభాగం ఉన్నాయి. ఈ కొత్త బ్లాక్ లో 10 ఆపరేషన్ థియేటర్లు, 327 సూపర్ స్పెషాలిటీ పడకలు, 92 ఐసియు పడకలు, 30 మందికి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కు శిక్షణ,  28 మందికి పిజి శిక్షణ అవకాశాలున్నాయి.  
అప్పటి ప్రధానమంత్రి  అటల్ బిహీరీ వాజ్ పేయ్ ప్రదర్శించిన ముందు చూపుకు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన దేశం కోసం ఆయన ఆలోచించారన్నారు.

 

 2003  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రసంగంలో దేశమంతటా ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల్లో అసమానతలు తొలగించాలని, అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని ఆయన తన సందేశంలో అభిలషించటాన్ని మంత్రి ప్రస్తావించారు. వైద్య విద్యా సదుపాయాలు పెంచటం ద్వారా అందుకు కృషి చేయాలన్న ఆయన పట్టుదల ఫలితంగానే ఆరు ఎయిమ్స్ వైద్య కేంద్రాలు స్థాపించగలిగామన్నారు. ఉన్న వైద్య విద్యా సంస్థల స్థాయి పెంచటం కూడా అందులో భాగమని గుర్తు చేశారు. 2014 నుంచి ఆ పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయిన ఫలితంగా 22 ఎయిమ్స్ స్థాపించామన్నారు. మరో 75 ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయి పెంచామని చెప్పారు. ఒక్క మధ్య ప్రదేశ్ లోనే ఎనిమిది వైద్య కళాశాలలు ప్రారంభించినట్టు, ఆకాంక్షాపూరిత జిల్లాలలో మరో ఆరు కళాశాలలు  ఏర్పాటు చేయబోతున్నట్టు డాక్టర్ హర్ష వర్ధన్ చెప్పారు. రాజ్ గఢ్, మాండ్లా, నీముచ్, షియోపూర్, సింగ్రౌలి అందులో ఉన్నాయన్నారు. భోపాల్ లో నిర్మిస్తున్న ఎన్ సి డి సి ప్రాంతీయ కేంద్రం ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ కు 13.99 లక్షల ఎన్ మాస్కులు, 7.97 లక్షల పిపిఇ కిట్లు, 54 లక్షల హెచ్ సి క్యూలు, 679 వెంటిలేటర్లు సమకూర్చిందన్నారు. ఇది కోవిడ్ మీద పోరును బలోపేతం చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. దీనికి తోడు 2,32,620 ఆర్ ఎన్ ఎ సేకరణ కిట్లు,  5,87,140 ఆర్ టి - పిసిఆర్ కిట్లు, 2,55,850 విటిఎం కిట్లు కేంద్రం అందకేసిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ  ప్రత్యేకంగా వైద్య రంగం మీద ప్రధాన దృష్టి సారించటం గురించి మంత్రి ప్రస్తావించారు. మనం 2025 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించటానికి కట్టుబడి ఉన్నామన్నారు. నిజానికి ఇది అంతర్జాతీయ గడువు కంటే ఐదేళ్ళు ముందు ఉన్నట్టు కూడా గుర్తు చేశారు. ఆలోచనాకరమైన మిషన్ ఇంద్రధనుష్ గురించి ప్రస్తావిస్తూ, 12 వ్యాధులను నివారించగలిగే టీకాల కార్యక్రమంలో బాలబాలికలందరికీ టీకాలు ఇవ్వాబోతున్నట్టు చెప్పారు. పోలియో విజయాన్ని ఇక్కడ కూడా పునరుద్ధరిస్తామన్నారు. ఆవిధంగా శిశుమరణాల సంఖ్యను ప్రతి వెయ్యికీ ఐదు నుంచి సున్నాకు దగ్గరగా తీసుకు వస్తామన్నారు. 
లోక్ సభ మాజీ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహజన్ సేవలను, మాజీ ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా చేసిన కృషిని గుర్తు చేస్తూ గడువు కంటే ఏడాది ముందే పూర్తి చేయగలిగామని సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే సంతోషం వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ లో ఆరోగ్య రంగ మౌలిక్మ సదుపాయాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం పోషిస్తున్న క్రియాశీలక పాత్రకి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధన్యవాదాలు తెలియజేశారు. మొదట్లో కోవిడ్ అనుమానితుల శాంపిల్స్ను విమానంలొ తరలించాల్సిన పరిస్థితి ఉండగా కేంద్ర ఆరోగ్య సాకామంత్రి చొరవ వల్ల రాష్ట్రంలో 76 ప్రభుత్వ లాబ్ లు అందుబాటులోకి వచ్చాయన్నారు.


పర్యాటక, సంస్కృతి శాఖామంత్రి శ్రీమతి ఉషా ఠాకూర్, నీటి వనరుల శాఖామంత్రి శ్రీ తులసీరామ్ సిలావత్, మధ్య ప్రదేశ్ మత్స్య అభివృద్ధి శాఖామంత్రి శ్రీ విశ్వాస్  సరంగ్, వైద్య విద్య, భోపాల్ గ్యాస్ బాధితుల సహాయం, పునరావాస శాఖామంత్రి, ఇండోర్ ఎంపీ శ్రీ సంకర్ లాల్వానీ, ఇండోర్ ఎమ్మెల్యే ఆకాశ విజయ్ వర్గీయ తదితరులు హాజరయ్యారు.

***


(Release ID: 1649344) Visitor Counter : 175


Read this release in: English , Urdu , Marathi , Hindi