సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ది ఆనెస్ట్’ అంశం పై వెబినార్ నిర్వహణ

ఈ ప్లాట్ ఫార్మ్ ప్రత్యక్ష పన్నుల సంబంధిత సంస్కరణల ప్రయాణాన్ని మరింత గా ముందుకు తీసుకుపోతుంది

Posted On: 21 AUG 2020 4:22PM by PIB Hyderabad

 ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 13వ తేదీ న ప్రారంభించిన ‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ది ఆనెస్ట్’ ప్లాట్ ఫార్మ్ దేశం లో ప్రత్యక్ష పన్నుల సంబంధిత సంస్కరణ ల ప్రయాణాన్ని మరింత గా ముందుకు తీసుకుపోతుందని హైదరాబాద్ లోని ఆదాయపు పన్నుల ప్రధాన కమిశనర్ శ్రీమతి వసుంధర సిన్హా అన్నారు. 

 

     ‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ది ఆనెస్ట్’ అంశం పై భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి), ఇంకా రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) లు శుక్రవారం నాడు హైదరాబాద్ లో నిర్వహించిన వెబినార్ లో శ్రీమతి వసుంధర సిన్హా  కీలకోపన్యాసాన్ని ఇచ్చారు. ఈ సందర్భం లో ఆమె నూతన విధానం లో ఆదాయపు పన్ను అధికారుల పట్ల విచక్షణ కు ఎంత మాత్రం తావు లేదు అని స్పష్టం చేశారు.  ఫేస్ లెస్ అసెస్ మెంట్ లో భాగం గా, పన్ను చెల్లింపుదారు యొక్క రిటర్న్ ల పరిశీలన యాదృచ్ఛికం గా ఎంపిక చేసిన ఒక పన్నుల సంబంధిత అధికారి ద్వారా జరుగుతుందే గాని తప్పనిసరిగా ఒకే అధికార పరిధి ద్వారా జరగబోదని వివరించారు.  దీని తో పన్ను చెల్లింపుదారు కు, ఇంకా పన్నుల సంబంధిత అధికారి కి మధ్య ఎటువంటి ముఖాముఖి సంప్రదింపు చోటు చేసుకొనే అవసరమే తలెత్తదని, తద్ద్వారా బలవంతపెట్టేందుకు అవకాశాలు తగ్గిపోతాయన్నారు.  ఈ చర్య అసెసీల కు నియమాల అనుసరణ తాలూకు భారాన్ని సులభతరం గా మార్చివేయగలదని భావించడం జరుగుతోంది.  అంతే కాకుండా, దేశ నిర్మాణం లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషిస్తున్న ‘‘నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారు’’ కు ఈ చర్య ఒక బహుమతి గా కూడా కూడా భావించడం జరుగుతుందని ఆదాయపు పన్నుల ప్రధాన కమిశనర్ చెప్పారు.  ఫేస్ లెస్ ట్యాక్స్ విధానం అనేది  పన్ను చెల్లింపుదారు కు న్యాయానికి, నిర్భీతి కి సంబంధించిన విశ్వాసాన్ని ఇనుమడింపచేయగలుగుతుందని కూడా ఆమె అన్నారు.

 

    ఈ వెబినార్ లో  పిఐబి డైరెక్టర్ జనరల్ (దక్షిణ ప్రాంతం)   శ్రీ ఎస్. వెంకటేశ్వ ర్ ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు.  పన్ను చెల్లింపుదారులు జాతి నిర్మాణం లో ఒక మహత్వపూర్ణమైన పాత్ర ను పోషిస్తారని, మరి నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారుల ను  గౌరవించుకోవాలని  శ్రీ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు.  ప్రత్యక్ష పన్ను ల విధానం లో పారదర్శకత్వాన్ని తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం అనేక చర్యల ను చేపట్టిందని ఆయన చెప్తూ, నూతనం గా ప్రవేశపెట్టిన ‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ది ఆనెస్ట్’ అనే ప్లాట్ ఫార్మ్ పన్నుల విధానాన్ని మరింత సరళతరం గా మార్చగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.   ఆన్ లైన్ మాధ్యమం లో ప్రత్యక్ష ప్రసారం పద్ధతి న జరిగిన ఈ కార్యక్రమం లో ఆదాయపు పన్ను విభాగం, పిఐబి, ఆర్ఒబి లకు చెందిన అధికారుల తో పాటు  అనేక మంది చార్టర్డ్ అకౌంటెంట్ లు కూడా పాల్గొన్నారు. 

 

***



(Release ID: 1647619) Visitor Counter : 103


Read this release in: English