శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
5 క్షేత్రాలకు చెందిన 49 కొత్త కల్పనలకు సహస్రాబ్ది కూటమి ఆరవ రౌండ్ మరియు కోవిడ్ -19 వినూత్న సవాలు అవార్డులు
"దేశవ్యాప్తంగా 4000 అంకుర సంస్థలను ప్రోది చేసే 150 టెక్నాలజీ సంస్థలకు శాస్త్ర సాంకేతిక శాఖ మద్దతిస్తోంది" -- ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ
प्रविष्टि तिथि:
19 AUG 2020 5:07PM by PIB Hyderabad
5 ప్రధాన రంగాలకు చెందిన 49 కొత్త కల్పనలను గుర్తించిన సహస్రాబ్ది కూటమి ఆరవ రౌండ్ మరియు కోవిడ్ -19 వినూత్న సవాలు అవార్డుల ప్రధానోత్సవం ఎంతో విస్తృతమైన వినూత్న పర్యావరణ వ్యవస్థను నిర్మించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది.
విస్తృత వినూత్న పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకోసం శాస్త్ర సాంకేతిక శాఖ (డి ఎస్ టి) త్వరలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించగలదని డి ఎస్ టి కార్యదర్శి ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ ప్రకటించారు. ఏదైనా ఒక అంకుర సంస్థ వినూత్న కల్పనలు చేయాలంటే అందుకు అవసరమైన యంత్రాంగం, మద్దతు, నమూనాల తయారీ సౌకర్యం ఉండటం ముఖ్యం. ఈ సౌకర్యాలన్నీ ప్రోది కేంద్రాల బయట కూడా ఏర్పాటు చేయవచ్చునని ప్రొఫెసర్ శర్మ అన్నారు.
దేశవ్యాప్తంగా 4000 అంకుర సంస్థలను ప్రోది చేసే 150 టెక్నాలజీ సంస్థలకు శాస్త్ర సాంకేతిక శాఖ మద్దతిస్తోంది. వాటి ద్వారా ఎన్నో వినూత్న కల్పనలు వృద్ధి చెందుతున్నాయి. ఈ సంఖ్యను పెంచే సంకల్పం ఉంది. ఈ మా యాత్రలో సహస్రాబ్ది కూటమితో పాటు
అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యు ఎస్ ఎ ఐ డి) , ఫిక్కీ, బ్రిటన్ కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి శాఖ (డి ఎఫ్ ఐ డి)
మంచి తోడ్పాటును అందిస్తున్నాయని ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ స్పష్టంగా తెలిపారు.
గత మంగళవారం చాక్షుష పద్ధతిలో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో అమెరికా ఛార్జ్ డి ఎఫైర్ ఎడ్గార్డ్ డి. కగన్ , ఇండియాలో బ్రిటిష్ హై కమిషనర్ సర్ ఫిలిప్ బర్దన్ కూడా ప్రసంగించారు.
ఇండియాలో ఐదు కేంద్ర రంగాలు వరుసగా విద్య, ఆరోగ్యం, శుభ్రమైన ఇంధనం, నీరు & పారిశుద్ధ్యం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు చెందిన కొత్త కల్పనలకు రూ. 26 కోట్ల మేర అవార్డులు బహుకరించారు. కోవిడ్ -19 వినూత్న సవాలు కేటగిరీలో 16 వినూత్న కల్పనలకు అవార్డులు ఇచ్చారు.
అన్ని భాగస్వామ్య సంస్థలకు చెందిన ప్రతినిధులు అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఫిక్కీ అంకుర కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ చౌదరిప్రసంగిస్తూ దేశంలో అంకుర సంస్థలు వినూత్న కల్పనలకోసం ఎంతో కృషి చేస్తున్నాయని, కోవిడ్ - 19 విసిరిన సవాలును అందిపుచ్చుకుని ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశాయని, కేవలం మూడు వారాల వ్యవధిలో 400 మంది స్పందించారని అన్నారు
వివిధ దేశాల సమన్వయంతో ఏర్పడిన సహస్రాబ్ది కూటమి ఇండియాలో సామాజిక సంస్థలకు ఆర్ధిక సహకారంతో పాటు అండదండగా ఉంటున్నది.


*****
(रिलीज़ आईडी: 1647202)
आगंतुक पटल : 285