శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మరో ఐదేండ్ల కాలానికి (2020-2025) భారత్- ఐరోపా సమాజం మధ్య శాస్త్ర మరియు సాంకేతిక సహకార ఒప్పందం పునరుద్ధరణ
Posted On:
25 JUL 2020 6:08PM by PIB Hyderabad
భారత్-ఐరోపా సమాజం తమ మధ్య ఉన్న శాస్త్ర మరియు సాంకేతిక సహకార ఒప్పందాన్ని మరో ఐదేండ్ల కాలానికి (2020-2025) పునరుద్ధరించుకున్నాయి. రెండు వైపుల మధ్య నోట్ వెర్బాలే మార్పిడి ద్వారా ఈ ఒప్పందాన్ని ఐదేండ్ల కాలానికి మరోసారి పునరుద్ధరించారు. తొలత ఈ ఒప్పందం 2001 నవంబరు 23న ఇరు పక్షాల మధ్య కుదిరింది. ఆ తరువాత ఇది 2007 మరియు 2015 మధ్య రెన్యూవల్ చేయబడింది. ఈ శాస్త్ర సాంకేతిక ఒప్పందం పరిశోధనలలో సహకారాన్ని విస్తరిస్తుంది. ఇరు పక్షాల వారికి సాధారణ ఆసక్తి ఉన్న రంగాలలో సహకార కార్యకలాపాల ప్రవర్తనను ఇది మరింతగా బలోపేతం చేయనుంది. అలాంటి సహకార ఫలితాలను వారి ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు వీలుపడనుంది. దీనికి తోడు పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి, ప్రాజెక్టుల ప్రదర్శన విభాగాలలో మన భారతీయ పరిశోధన సంస్థలు, యూరోపియన్ పరిశోధనా సంస్థలు పరస్పరం భాగస్వామ్యం వహించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ఇటీవల జరిగిన 15వ ఇండియా-ఈయూ సమిట్‌లో ఈ శాస్త్ర మరియు సాంకేతిక సహకార ఒప్పందాన్ని ఐదేండ్ల కాలానికి (2020-2025) పునరుద్ధరించాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో భారత బృందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వం వహించారు. ఐరోపా సమాజపు ప్రతినిధి బృందానికి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్ నాయకత్వం వహించారు. ఈ "ఒప్పంద" చట్రంలో భారత్- యూరోపియన్ యూనియన్ బలమైన పరిశోధన, ఆవిష్కరణ సహకారాన్ని కలిగి ఉన్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో క్రమానుకూలం ఈ తరహా సహకారం పెరుగుతూ వస్తోంది. ఒప్పందంలో భాగంగా గడిచిన ఐదేండ్ల కాలంలో, సరసమైన ఆరోగ్య సంరక్షణ, నీరు, ఇంధనం, ఆహారం మరియు పోషణ వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి భారతదేశం-ఈయూ రీసెర్చ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులపై సహ-పెట్టుబడి స్థాయిని పెంచారు. ఫలితంగా అనేక సాంకేతికతలు, పేటెంట్ల అభివృద్ధి, వాటి లాభాలు వినియోగం, ఉమ్మడి పరిశోధన ప్రచురణలు, పరిశోధన సదుపాయాల భాగస్వామ్యం మరియు, రెండు వైపుల నుండి శాస్త్రవేత్తలు మరియు విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. నీరు, హరిత రవాణా, ఈ-మొబిలిటీ, స్వచ్ఛమైన శక్తి, సర్క్యూలర్ ఆర్థిక వ్యవస్థ, బయో ఎకానమీ, ఆరోగ్యం మరియు ఐసీటీ వంటి అంశాలపై దృష్టి సారించారు. దీనికి తోడు వాతావరణ మార్పు, స్థిరమైన పట్టణ అభివృద్ధి, తయారీ, అధునాతన పదార్థాలు, నానోటెక్నాలజీలతో పాటుగా బయో టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, సముద్ర పరిశోధన వంటి ఇతర అంశాలపై కూడా భవిష్యత్ ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. మానవ అభివృద్ధి మరియు ఆవిష్కరణలలో ఐరోపా సమాజం మరియు భారతదేశం ముందంజలో ఉన్నాయి. పొదుపు ఆవిష్కరణల ద్వారా తన ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం మరియు హైటెక్ మార్కెట్లలో రాణించడం వంటివి భారత్‌కు జంట లక్ష్యాలుగా ఉన్నాయి. ఐరోపా సమాజం-భారత సహకారాలు రెండు ప్రాంతాలు పరస్పరం ప్రయోజనకరమైన అవకాశాలను అందిస్తున్నాయి. విద్యార్థులు, పరిశోధకులు మరియు నిపుణుల మధ్య పెరిగిన సాంకేతిక మార్పిడి అంశాలు రెండు వైపుల వారికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రతిభ చైతన్యం విషయమై భారతదేశం మరియు ఈయూ పరస్పర ఆసక్తిని పంచుకుంటాయి. పరిశోధకులు మరియు ఆవిష్కర్తల చైతన్యపు అంశం ఇరు వైపులా ప్రచారం చేయబడుతుంది. ఈయూ- భారతీయ ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, ఇంక్యుబేటర్లు మరియు యాక్సిలరేటర్ల మధ్య నెట్‌వర్కింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా, ఆఫ్‌లైన్ మరియు వర్చువల్ రెండింటిలోనూ ఉమ్మడి ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మరియు కోచింగ్, శిక్షణ మరియు సిబ్బంది మార్పిడిలో పాల్గొనడంతో పాటు ఆవిష్కరణను ప్రోత్సహించనున్నారు. మేటి అర్హతలను కలిగి ఉన్న కార్మికులను భారతీయ మరియు ఈయూ నేతృత్వంలోని ఇన్నోవేషన్ సిస్టమ్స్ పరిశ్రమలలో విలీనం చేయవచ్చు. సాంకేతిక-ఆధారిత నాయకత్వాన్ని నిర్వహించేందుకు మరియు ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యం, ఎస్ఎంఈ ల అంతర్జాతీయీకరణ మరియు ప్రపంచ విలువ గొలుసులో సహకర విషయంలో కలిసి ముందుకు సాగేందుకు వీలు పడనుంది.
****
(Release ID: 1641281)
Visitor Counter : 272