శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కీలక ఔషధాలలోని మూలకాల స్థితిగతులు, సమస్యలు, టెక్నాలజీ అందుబాటు, సవాళ్ళమీద నివేదిక విడుదల

Posted On: 15 JUL 2020 6:06PM by PIB Hyderabad

కీలకమైన ఔషధాలలోని మూలకాల స్వదేశీ ఉత్పత్తిని పెంచటం ద్వారా ఉత్పత్తి గిట్టుబాటు అయ్యేలా చూదాలని టి ఐ ఎఫ్ ఎ సి నివేదిక సూచించింది. ఎలాంటి ఔషధ మూలకాలకు ప్రాధాన్యం ఇవ్వాలో, వాటి వలన కలిగే ప్రయోజనాలేంటో ఆ నివేదిక వివరంగా పేర్కొంది. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రెడియెంట్స్ పేరుతో రూపొందిన ఈ నివేదికను భారత ప్రభుత్వపు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం పరిధిలోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్ మెంట్ కౌన్సిల్ ( టి ఐ ఎఫ్ ఎ సి ) అనే స్వతంత్ర సంస్థ ఇటీవల రూపొందించి విడుదలచేసింది.

కోవిడ్ అనంతరం మేకిన్ ఇండియాలో దృష్టి సారించాల్సిన అంశాలు అనే శ్వేత పత్రంతోబాటు ఈ నివేదికను కేంద్ర శాస్త్ర సాంకేతిక,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఆవిష్కరించారు. జులై10న వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు (సైన్స్ అండ్ టెక్నాలజీ) డాక్టర్ వి,కె, సారస్వత్,  టి ఐ ఎఫ్ ఎ సి పాలకమండలి చైర్మన్ ప్రొఫెసఎ శ్రీవాస్తవ, సంస్థ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ సింగ్, శాస్త్రవేత్త శ్రీ ముఖేశ్ మాథుర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

టెక్నాలజీని అభివృద్ధి పరచటంలో ఇంజనీరింగ్ కోణం మీద పరిమాణం మీద ప్రధానంగా సిఫార్సులు దృష్టిపెట్టాయి. నిర్దిష్ఠ లక్ష్యాలతో కెమికల్ ఇంజనీరింగ్ ను దీక్షతో చేపట్టాల్సిన అవసరాన్ని, అవిచ్ఛిన్నంగా అణువుల సంశ్లేషణ జరిగేలా చూడటం మీద, ఉమ్మడి మౌలిక సదుపాయాలతో భారీ ఔషధ తయారీ క్లస్టర్స్ ఏర్పాటు మీద ఈ నివేదిక సిఫార్సులున్నాయి. తయారీ ప్రక్రియను కుదించి ధరను అదుపులో ఉంచటానికి, తయారీ పరిమాణం పెంచటానికి, ప్రమాదకరమైన రసాయనిక ప్రతి చర్యలమీద దృష్టిపెట్టే టెక్నాలజీలను అందుకోవటానికి, క్రయోజనిక్ ప్రతిచర్యలు తదితర అంశాలను కూడా  ఇది స్పృశించింది.
 
స్టెరాయిడ్స్, యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లియీసైడ్స్ వంటి రసాయనిక విభాగాలలో భారతీయ కంపెనీలు పనిచేయటానికి భారత ప్రభుత్వం తగినంత ప్రోత్సాహం ఇవ్వాలని ఈ నివేదిక సూచించింది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అంది పుచ్చుకోవటానికి లేదా సాంకేతికత బదలాయింపును ప్రోత్సహిస్తే చదువుకూ, పరిశ్రమకూ మధ్య అనుబంధం పెరిగి వాణిజ్యపరమైన లాభదాయక ఉత్పత్తికి దారితీస్తుందని పేర్కొంది.

కోవిడ్ సంక్షోభం దేశాన్ని  ఆత్మ నిర్భరత మీద నిలబెట్టింది. టిఐ ఎఫ్ ఎ సి రూపొందించిన ఈ శ్వేతపత్రం కోవిడ్ అనంతరం మార్కెట్ ధోరణులను, బలాలను చాటిచెప్పేందుకు మేకిన్ ఇండియా నినాదం ఉపయోగపడిందని అభివర్ణించింది. దీనివలన దేసానికి ఎంతో కీలకమైన ఆరోగ్య రంగంతో సహా ఐదు ప్రధాన రంగాలకు మేలు జరిగిందని పేర్కొంది. ఔషధాల మూలకాల కోసం దిగుమతులపై, ముఖ్యంగా చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితిని ఈ శ్వేత పత్రం ఎత్తి చూపింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ నేపథ్యంలో భారత్ ఈ ఔషధాల ముడిసరకు తయారీలో స్వావలంబనకు కృషి చేయాల్సి ఉందని సూచించింది.

పరిమాణం పరంగా భారత ఔషధ పరిశ్రమ అంతర్జాతీయంగా చైనా, ఇటలీ తరువాత మూడో స్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే పద్నాలుగో స్థానంలో ఉంది. 3,000 ఔషధ సంస్థలు,10,500 తయారీ యీనిట్లతో బలమైన నెట్ వర్క్ మనది. 2019 లో స్వదేశీ టర్నోవర్ 1.4 లక్షల కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా 200 కు పైగా దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. 


ఇంత బలమైన పునాది ఉన్నప్పటికీ తక్కువ లాభాలు అంతంత మాత్రంగా ఉండటం, ఆకట్టుకునే పరిశ్రమ కాకపోవటం కారణంగా స్వదేశీ ఔషధ కంపెనీలు ముడి సరకు అయిన మూలకాల తయారీని క్రమంగా నిలిపి వేశాయి. దీంతో వాటి దిగుమతులమీద ఆధారపడటం పెరుగుతూ వచ్చింది. ఇది చౌకగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయం కావటంతో ఔషధాల మీద లాభాలు పెంచుకోవటానికి కూడా దోహదం చేసింది.  చైనా నుంచి మూలక రసాయనాలు చౌకగా దిగుమతి చేసుకోవటం వలన అలా దిగుమతులమీద ఎక్కువగా ఆధారపడటం బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం అది దాదాపు 68% శాతానికి చేరింది. దీన్ని ఎదుర్కోవటానికి, స్వావలంబన సాధించటానికి  అనుసరించాల్సిన స్వల్పకాలిక, మధ్యకాలిక వ్యూహాలను టి ఐ ఎఫ్ ఎ సి సిఫార్సు చేసింది.
 

*****


(Release ID: 1638896) Visitor Counter : 266


Read this release in: Tamil , English , Urdu , Hindi