ప్రధాన మంత్రి కార్యాలయం
అంతరిక్ష రంగంలో చారిత్రక సంస్కరణలకు శ్రీకారం
అంతరిక్ష కార్యకలాపాల్లోకి ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి ఆమోదం
Posted On:
24 JUN 2020 3:57PM by PIB Hyderabad
అంతరిక్ష కార్యకలాపాలలోకి ప్రయివేటు రంగాల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే లక్ష్యంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ రోజు అంతరిక్ష రంగంలో చాలా కీలకమైన సంస్కరణలకు ఆమోదం తెలిపింది. భారత దేశాన్ని స్వావలంబన మరియు సాంకేతికంగా ముందుకు తీసుకుపోవాలనే ప్రధాన మంత్రి దీర్ఘకాలిక దృష్టికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతరిక్ష రంగంలో అధునాతన సామర్థ్యాలు కలిగి ఉన్న కొన్ని దేశాలలో భారత్ ఒకటి. ఈ సంస్కరణలతో భారత దేశం ఈ రంగంలో కొత్తశక్తిని మరియు చైతన్యాన్ని పొందనుంది. అంతరిక్ష కార్యకలాపాల యొక్క తదుపరి దశల్లోకి మన దేశం దూసుకెళ్లేందుకు కూడా ఈ తాజా నిర్ణయం దోహదపడనుంది. తాజా సంస్కరణలు ఈ రంగం యొక్క వేగవంతమైన వృద్ధికి దారి తీయనున్నాయి. అంతేకాక ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత పరిశ్రమ ఒక కీలక పాత్ర పోషించేందుకూ దోహదం పడనుంది. భారత్ గ్లోబల్ టెక్నాలజీకి పవర్‌హౌస్‌గా మారుతుంది. దీనికి తోడు సాంకేతిక రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
కీలక ప్రయోజనాలుః
దేశ పారిశ్రమల సాంకేతిక పురోగతి మరియు విస్తరణలో అంతరిక్ష రంగం ప్రధాన ఉత్ప్రేరకపు పాత్ర పోషించనుంది. ప్రతిపాదిత సంస్కరణలు అంతరిక్ష ఆస్తులు మరియు కార్యకలాపాల యొక్క సామాజిక - ఆర్ధిక వినియోగాన్ని మెరుగు పరుస్తుంది. అంతరిక్ష ఆస్తులు, డేటా మరియు సౌకర్యాలకు మెరుగైన ప్రాప్యతా లభించనుంది. కొత్తగా సృష్టించిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్-ఎస్‌పీఏసీఈ) ప్రయివేటు కంపెనీలకు కూడా భారతీయ అంతరిక్ష మౌలిక సదుపాయాలను ఉపయోగించేందుకు సమానమైన అవకాశాన్ని అందించనుంది. ఇది తగిన ప్రోత్సాహకరమైన విధానాలు మరియు స్నేహ పూర్వక నియంత్రణ వాతావరణం ద్వారా అంతరిక్ష కార్యకలాపాలలో ప్రయివేటు పరిశ్రమల్ని నియంత్రణలో, ప్రోత్సహించడంతో పాటుగా తగిన మార్గనిర్దేశనమూ చేస్తుంది.
పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్)’ అంతరిక్ష కార్యకలాపాలను ‘సరఫరా ఆధారిత’ మోడల్ నుండి ‘డిమాండ్ ఆధారిత’ మోడల్‌కు తిరిగి ఓరియంట్ చేయడానికి యత్నించనుంది. తద్వారా మన అంతరిక్ష ఆస్తుల వాంఛనీయ వినియోగాన్ని కూడా ఇది నిర్ధారిస్తుంది. ఈ సంస్కరణలు ఇస్రో పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలతో పాటుగా కొత్త సాంకేతికతలు, అన్వేషణ మిషన్లు మరియు మానవ రహిత అంతరిక్ష ప్రయాణ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది. ‘అవకాశాల ప్రకటన’ విధానం ద్వారా కొన్ని గ్రహాల అన్వేషణ కార్యకలాపాలను కూడా ప్రయివేటు రంగానికి తెరవబడతాయి.
*******
(Release ID: 1634044)
Visitor Counter : 370
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam