భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

నైరుతి రుతుపవనాల రాకకు మరింత అనుకూలంగా పరిస్థితులు

· పశ్చిమ హిమాలయ ప్రాంతంలో విస్తృతంగా వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం

· రానున్న 24 గంటల్లో ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తర ప్రదేశ్ మరియు దక్షిణ రాజస్థాన్ లో కూడా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Posted On: 05 JUN 2020 2:02PM by PIB Hyderabad

ముఖ్యమైన వాతావరణ అంశాలు

నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కరైకల్, నైరుతి మరియు తూర్పుమధ్య బే ఆఫ్ బెంగాల్ దిశగా రావడానికి పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయి. రానున్న 2 రోజుల్లో మొత్తం అగ్నేయ బంగాళాశాతం మరియు వెస్ట్ సెంట్రల్ బే అఫ్ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.

పశ్చిమ అవాంతరాలు ప్రభావంతో, పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురికే అవకాశం ఉంది. 2 రోజుల తర్వాత ఇది కాస్తంత తగ్గనుంది.

వచ్చే 2 రోజుల్లో ఈ ప్రాంతాల్లో మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయి. ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు దక్షిణ రాజస్థాన్ రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచన ఉంది.

పశ్చిమ తీరం వెంబడి విస్తృతమైన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు మరియు గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడుల్లో 4 నుంచి 5 రోజులు విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉంది.

కేరళ, కొంకణ్ మరియు గోవా లో వచ్చే 3 రోజుల్లో, తీర కర్ణాటక పై వచ్చే 24 గంటల్లో భారీ వర్షపాతానికి అవకాశం ఉంది.

 

 

మరిన్ని వివరాల కోసం దయచేసి www.mausam.imd.gov.in ని సందర్శించండి

 

***



(Release ID: 1629700) Visitor Counter : 201