వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

స్క్రోల్ లో వచ్చిన రిపోర్ట్ ని తోసిపుచ్చిన భారత ఆహార సంస్థ: 65లక్షల ఆహార ధాన్యాలు కుళ్ళివృధా అయ్యాయి అనడానికి ఖండన

Posted On: 03 JUN 2020 8:16PM by PIB Hyderabad

“భారతదేశం నాలుగు నెలల్లో 65 లక్షల టన్నుల ధాన్యాన్ని వృథాగా కోల్పోయింది, పేదలు ఆకలితో ఉన్నప్పటికీ..” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తా కథనాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) తీవ్రంగా ఖండించింది. ఈ కథనం "పూర్తి అన్యాయం"తో కూడుకున్నదని, సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఎఫ్‌సిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (క్వాలిటీ కంట్రోల్) శ్రీ సుదీప్ సింగ్ వెబ్‌సైట్‌కు గట్టిగా రాసిన లేఖలో ఖండించారు.  "చాలా తప్పు సమాచారం ఉందని గత 4 నెలల్లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయ్యాయని,  వాస్తవాలను తనిఖీ చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా, ప్రజలకు పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 

నిల్వల స్థితిగతుల గురించి నిర్లక్షయంగా,అన్యాయంగా ప్రచురించారని శ్రీ సుదీప్ సింగ్ చెబుతూ, ఊహాజనితమైన అంకెలుగా, 71.8లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు వృధా అయిపోయాయనడం తప్పిదమని అన్నారు. 2019-20లో మొత్తం నిల్వల్లో 1930 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు మాత్రం జారీ కాబడలేదని (పనికిరానివిగా), అదీనూ ప్రకృతి వైపరీత్యాల వల్లే అవి వృధా అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. 

సొసైటీ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రచురించిన “కోవిడ్ 19 లాక్డౌన్ - వ్యవసాయం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం” అనే శ్రీ వికాస్ రావల్, శ్రీ మనీష్ కుమార్, శ్రీ అంకుర్ వర్మ పరిశోధనా పత్రం సారాంశాల ఆధారంగా ఈ వార్తా వ్యాసం రూపొందించబడిందని వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ చెప్పారు.  సహ రచయితలలో ఒకరైన ప్రొఫెసర్ వికాస్ రావల్‌తో మాట్లాడినట్లు ఎఫ్‌సిఐ పేర్కొంది. మండీలలో ఉన్న నిల్వలు, జారీ కాకుండా ఉన్న పరిమాణాన్ని పోలుస్తూ ఉన్న డాటాను తాము పరిగణలోకి తీసుకున్నామని వారు చెప్పినట్టు ఎఫ్ సి ఐ అధికారి వివరించారు. 

మండీలలో ఉన్న నిల్వ, రవాణా లో ఉన్న నిల్వలు ప్రజలు వినియోగానికి కచ్చితంగా ఉపయోగపడుతుందని దానిని వృధా అయిపోయిన ఆహార ధాన్యాలుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ అనలేమని ఎఫ్ సి ఐ తెలిపింది. వార్త కథనాన్ని ప్రచురించే ముందు వాస్తవ వివరాలు తమను అడిగి తెలుసుకుని ఉండి ఉంటె, ఎఫ్ సి ఐ పై ఈ విధమైన తప్పుడు ఆరోపణ చేసి ఉండేవారు  కాదని శ్రీ సింగ్ తెలిపారు. 

           ఏప్రిల్ మరియు మే నెలల్లో రబీ సీజన్ గోధుమ సేకరణ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఏప్రిల్ 15న ప్రారంభమైన గోధుమ సేకరణ సీజన్లో, ఇప్పటికే 365 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేశాయి. మండీలు అని పిలిచే కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన గోధుమ నిల్వలు కొంత కాలానికి నిల్వ కేంద్రాలకు మార్చబడతాయి. కార్మికులు, ట్రక్కుల లభ్యత, రవాణా, వంటి అవసరాలు ఇమిడి ఉన్న ఈ పెద్ద వ్యవస్థలో ఈ స్టాక్‌లను నిల్వ చేయడానికి బదిలీ చేయడానికి కొంత సమయం ఆలస్యం ఉంది. సేకరణ కార్యకలాపాల సమయంలో ఏ సమయంలోనైనా, కొన్ని గోధుమ నిల్వలు సేకరించబడతాయి, ఇది ఎప్పుడూ జరిగే కసరత్తే. 01.05.2020 నాటికి 56.35 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ నిల్వలను ఇంకా మండీల నుండి స్టోరేజ్ పాయింట్లకు మార్చలేదు. ఈ స్టాక్స్ తరువాత మార్చి, సెంట్రల్ పూల్ ఖాతాలోకి తీసుకున్నారు. 

      "సేకరణ కేంద్రాలలో ఉన్న ఈ గోధుమ నిల్వలను నిల్వ కేంద్రాలకు, బియ్యం మరియు గోధుమలను రవాణా చేసే రాష్ట్రాల నుండి వినియోగించే రాష్ట్రాలకు రవాణా చేయటానికి" వృధా ఆహార ధాన్యాలు "గా  ప్రచురించినట్టు వార్తా నివేదిక నుండి స్పష్టంగా తెలుస్తుంది. ”అని శ్రీ సింగ్ అన్నారు

గడచిన 3 నెలల్లో కేంద్ర పూల్ లోని దెబ్బ తిన్న  ఆహార ధాన్యాల వివరాలు ఎఫ్ సి ఐ ప్రచురించింది, రికార్డు కోసం..  

క్రమ 

సంఖ్య

సంవత్సరం

బియ్యం(మెట్రిక్ టన్నుల్లో)

గోధుమలు(మెట్రిక్ టన్నుల్లో)

మొత్తం (మెట్రిక్ టన్నుల్లో)

మొత్తం జారీ అయినది (లక్షల మెట్రిక్ టన్నుల్లో)

 

మొత్తం నిల్వల్లో దెబ్బతిన్న ఆహార ధాన్యాల శాతం 

1

2017-18

820

1844

2664

452.16

0.006 %

2

2018-19

1420

3794

5214

500.08

0.010 %

3

2019-20

864

1066

1930

455.13

0.004 %

“పరిశోధన చేసిన వారు కానీ, ఆన్లైన్ న్యూస్ పోర్టల్ కానీ డేటా/పరిభాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు, వాస్తవాలను సరిగా తెలుసుకోకుండా వార్త కథనాన్ని ప్రచురించడం, కోవిడ్ఎ-19ని ఎదుర్కోవడంలో ముందు వరుసలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్ సి ఐ ప్రతిష్ఠ కు భంగం కల్గించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం అని  శ్రీ సింగ్ అన్నారు. 

                                                                                                            *******


(Release ID: 1629254) Visitor Counter : 199