రక్షణ మంత్రిత్వ శాఖ
మిషన్ సాగర్: కొమొరోస్ లోని మొరోని పోర్ట్ కి చేరుకున్న ఐఎన్ఎస్ కేసరి
Posted On:
31 MAY 2020 9:32PM by PIB Hyderabad
మిషన్ సాగర్‌లో భాగంగా, భారత నావికాదళ షిప్ కేసరి మే 31న కొమొరోస్ లోని పోర్ట్ ఆఫ్ మొరోని లోకి ప్రవేశించింది. ఈ క్లిష్ట సమయాల్లో కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో, అదే ఐఎన్ఎస్ కేసరి, మిత్ర దేశాలకు సహాయం అందిస్తోంది. కొమొరోస్ ప్రజలకు కోవిడ్ సంబంధిత అవసరమైన ఔషధాల సరుకును తీసుకువెళుతోంది.
దీనితో పాటు, భారత నావికాదళ వైద్యులు, పారామెడిక్స్‌తో కూడిన 14 మంది సభ్యుల స్పెషలిస్ట్ వైద్య బృందం కూడా ఈ నౌకలో కొమొరోస్‌లోని వారి సహచరులతో కలిసి పనిచేయడానికి బయలుదేరింది. కోవిడ్ -19, డెంగ్యూ జ్వరాలకు కలిసి సహాయం చేస్తుంది. వైద్య బృందంలో మెడికల్, కమ్యూనిటీ స్పెషలిస్టులు, పాథాలజిస్ట్ సహా నిపుణులు ఉన్నారు.
31 ఔషధాలను భారత ప్రభుత్వం నుండి కొమొరోస్ ప్రభుత్వానికి అందజేసే అధికారిక కార్యక్రమం 31 మే 2020 న జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, సాలిడారిటీ, సామాజిక రక్షణ మంత్రి . శ్రీమతి లౌబ్ యాకౌట్ జైడౌ పాల్గొన్నారు. భారత జట్టుకు కమాండింగ్ ఆఫీసర్ ఇండియన్ నావల్ షిప్ కేసరి కమాండర్ ముఖేష్ తయల్, గౌరవ. కొమొరోస్లో భారత కాన్సుల్ శ్రీ సాగుయిర్ సామ్.ప్రాతినిధ్యం వహించారు.
కొమొరోస్, భారత్ ఎల్లప్పుడూ సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై సారూప్యతను కలిగి ఉన్నాయి. కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి, డెంగ్యూ జ్వరాల మధ్య కొమొరోస్కు సహాయం భారత ప్రభుత్వం కార్యక్రమాల్లో ఒక భాగం. ‘మిషన్ సాగర్’,కోవిడ్-19 మహమ్మారిని, దాని ఫలితంగా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవటానికి ఇరు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాలను రూపొందిస్తుంది. ఈ విస్తరణ మన ప్రధానమంత్రి ఆలోచనకు అనుగుణంగా ‘ప్రాంతంలోని అందరికీ భద్రత మరియు వృద్ధి (సాగర్)’ ని ప్రతిబింబిస్తుంది. ఐఓఆర్ లోని దేశాలతో సంబంధాలకు భారతదేశం ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు భారత ప్రభుత్వ ఇతర ఏజెన్సీలతో సన్నిహిత సమన్వయంతో ఈ ఆపరేషన్ పురోగమిస్తోంది.
******
(Release ID: 1628544)
Visitor Counter : 181