పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 2020 నెలకు సంబంధించిన ఉత్పత్తి నివేదిక
ముడి చమురు ఉత్పత్తి వివరాలు
Posted On:
23 MAY 2020 11:29AM by PIB Hyderabad
ఈ ఏడాది ఏప్రిల్ నెల ముడిచమురు ఉత్పత్తిని తీసుకుంటే ఇది 2545.81 టిఎంటిగా నమోదైంది. నిర్దేశించుకున్న లక్ష్యానికంటే ఇది 1.44 శాతం. గత ఏడాది ఏప్రిల్ నెల ఉత్పత్తితో పోల్చితే ఇది 6.35 శాతం తక్కువ.
ఆయా సంస్థల్లో ఉత్పత్తి వివరాలను తీసుకుంటే ఓన్ జిసికి సంబంధించి ముడి చమురు ఉత్పత్తి ఈ ఏడాది ఏప్రిల్ లో 1681. 77 టిఎంటిగా నమోదైంది. నిర్దేశించుకున్న లక్ష్యానికంటే ఇది 0.65 శాతం తక్కువ. గత ఏడాది ఏప్రిల్ నెల ఉత్పత్తితో పోలిస్తే ఇది 0.53 శాతం తక్కువ. కోవిడ్ -19 మహమ్మారి వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో పశ్చిమ తీరంలో బావులు మూసేయడం జరిగింది. దాంతో ముడిచమురు ఉత్పత్తి తగ్గింది.
ఇదే విధంగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ కు సంబంధించి నమోదైన ముడి చమురు ఉత్పత్తి వివరాలు తీసుకుంటే ఇక్కడ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 248.25 టిఎంటి ఉత్పత్తి జరిగింది. ఇది నిర్దేశించికున్న లక్ష్యంకంటే 0.9 శాతం తక్కువ. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది 6.39 శాతం తక్కువ. ఉత్పత్తి తగ్గడానికి కోవిడ్ -19 లాక్ డౌన్‌తోపాటు పలు ఇతర కారణాలు కూడా వున్నాయి.
అలాగే జెవిఎస్ కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 615.80 టిఎంటి ముడిచమురు ఉత్పత్తి అయింది. ఇది నిర్దేశించుకున్న లక్ష్యానికంటే 3.73 శాతం తక్కువ. అలాగే గత ఏడాది ఏప్రిల్ నెల ఉత్పత్తితో పోల్చుకుంటే ఇది 19.25 శాతం తక్కువ. లాక్ డౌన్ తోపాటు పలు ఇతర కారణాలవల్ల ఉత్పత్తి తగ్గింది.
........
సహజవాయువు ఉత్పత్తి వివరాలు
................
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దేశంలో ఉత్పత్తి అయిన సహజ వాయువు 2161.33 ఎంఎంఎస్ సి ఎం. ఇది నిర్దేశించుకున్న లక్ష్యంకంటే 10.88 శాతం తక్కువ. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది 18.62 శాతం తక్కువ. లాక్ డౌన్‌తో పాటు పలు ఇతర కారణాలవల్ల ఆయా సంస్థల్లో ఉత్పత్తి తగ్గింది.
...................
రిఫైనరీ ఉత్పత్తి వివరాలు
.............
దేశంలో రిఫైనరీలద్వారా జరిగే ఉత్పత్తిని తీసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇది 14745.18 టిఎంటిలుగా నమోదైంది. ఇది ఏప్రిల్ నెలకుగాను నిర్దేశించుకున్న లక్ష్యంకంటే 22.01 శాతం తక్కువ. అలాగే గత ఏడాది ఏప్రిల్ నెల ఉత్పత్తితో పోలిస్తే ఇది 28.78 శాతం తక్కువ. రిఫైనరీలవద్ద ఉత్పత్తి తగ్గడానికి కూడా లాక్ డౌన్ తో పాటు పలు ఇతర కారణాలు కూడా తోడయ్యాయని అధికారులు తమ నివేదికల్లో వెల్లడించారు.
...................
(Release ID: 1626548)
Visitor Counter : 228