భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
సూపర్ సైక్లోన్ అంఫన్ (14.30 గంటల ఐఎస్‌టి సమయానికి) పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉంది: పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిషా తీరాలకు, ఆరంజ్ సందేశం
Posted On:
19 MAY 2020 3:31PM by PIB Hyderabad
భారత వాతావరణ విభాగానికి చెందిన జాతీయ వాతావరణ సూచనల కేంద్రం, తుపాను హెచ్చరికల కేంద్రం (భారత కాలమానం ప్రకారం 14.30 గంటలకు) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
సూపర్ సైక్లోన్ అంఫన్ (UM-PUN) పశ్చిమ బధ్య బంగాళాఖాతం నుంచి కదిలి ఞత్తర ఈశాన్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గత ఆరుగంటలుగా కదిలి 19 మే 2020 ఉదయం 11.30 ఐఎస్‌టి గంటలకు ఒడిషాలోని పరదీప్ కు దక్షిణంగా 420 కిలోమీటర్ల దూరంలో అలాగే పశ్చిమ బెంగాల్ లోని దిగాకు దక్షిణ - నైరుతి దిశగా , బంగ్లాదేశ్‌లోని ఖెపుపారాకు 700 దక్షిణ -నైరుతి దిశగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 16.5°N అక్షాంశం, 86.9°E రేఖాంశం మధ్య కేంద్రీకృతమై ఉంది.
ఇది ఉత్తర వాయవ్య బంగాళాఖాతం వెంట ఉత్తర ఈశాన్య దిశగా పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరప్రాంతాన్ని డిఘా (పశ్చిమబెంగాల్), సుందర్‌బన్‌కు దగ్గరలోని హతియా దీవులు (బంగ్లాదేశ్) వద్ద మే 20,2020 మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోగా గరిష్ఠంగా గంటలకు 155-165 కిలోమీటర్ల వేగంతో తీరం దాటే అవకాశం ఉంది.
తుపాను గమనాన్నివిశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)లోని డాప్లర్ వెదర్ రాడార్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
తుపాను తీవ్రతకు సంబంధించిన సమాచారం వివరాలు కింది టేబుల్‌లో చూడవచ్చు:
తేది సమయం
ఐఎస్‌టి |
పొజిషన్
అక్షాంశ,రేఖాంశాలు |
గరిష్ఠ ఉపరితల
గాలివేగం (Kmph) |
తుపాను కేటగిరీ |
19.05.20/1130 |
16.5/86.9 |
210-220 gusting to 240 |
అత్యంత తీవ్రమైన తుపాను
|
19.05.20/1730 |
17.1/87.1 |
200-210 gusting to 230 |
అత్యంత తీవ్రమైన తుపాను
|
19.05.20/2330 |
18.0/87.3 |
190-200 gusting to 220 |
అత్యంత తీవ్రమైన తుపాను
|
20.05.20/0530 |
19.3/87.7 |
180-190 gusting to 210 |
అత్యంత తీవ్రమైన తుపాను
|
20.05.20/1130 |
20.9/88.2 |
160-170 gusting to 190 |
చాలా తీవ్రమైన తుపాను
|
20.05.20/2330 |
22.7/88.7 |
95-105 gusting to 115 |
తుపాను
|
21.05.20/1130 |
24.3/89.3 |
50-60 gusting to 70 |
అల్పపీడనం
|
21.05.20/2330 |
25.6/90.2 |
20-30 gusting to 40 |
అత్యల్పపీడనం
|
భారీ వర్ష హెచ్చరిక:
ఒడిషా:ఒడిశాలోని చాలా ప్రదేశాలలో తేలికపాటి నుండి ఒకమాదిరి వర్షపాతం కురిసే అవకాశం ఉంటుంది,అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షపాతం ఉండవచ్చు. 20 మే 2020 న ఉత్తర తీర ఒడిశా (బాలసోర్, భద్రక్, మయూరభంజ్, జాజ్‌పూర్, కేంద్రాపారా , కియోన్‌జర్‌ఘడ్‌జిల్లాలు) పై అక్కడడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురవవచ్చు.
పశ్చిమబెంగాల్!
గంగా పశ్చిమ బెంగాల్ (తూర్పు మిడ్నపూర్, దక్షిణ , ఉత్తర 24 పరగణాలు) తీరప్రాంత జిల్లాలలో ఈ రోజు, మే 19 సాయంత్రం నుండి అనేక ప్రదేశాలలో తేలికపాటి నుండి ఒకమాదిరి వర్షపాతం కురిసే అవకాశం ఉంది. వర్షపాతం తీవ్రత క్రమంగా పెరగవచ్చు. 2020, మే 20 న ఇది గరిష్ఠ స్థాయికి మారవచ్చు. మే 20 న గంగా ప్రాంతపశ్చిమ బెంగాల్ (తూర్పు పశ్చిమ మిడ్నపూర్, దక్షిణ , ఉత్తర 24 పరగణాలు, హౌరా, హూగ్లి, కోల్‌కతా పరిసర జిల్లా)లలో ఎక్కువ ప్రదేశాలలో భారీ నుండి అతిభారీ భారీ వర్షపాతం , 21 మే, 2020 నఆయా జిల్లాల లోతట్టు ప్రాంతాలలో భారీ వర్షం కరవవచ్చు.
సముద్ర పరిస్థితి:
సముద్రం అసాధారణంగా ఉండవచ్చు.పశ్చిమ కేంద్ర బంగాళాఖాతంలో మరో ఆరుగంటలు ఈ పరిస్జతి కొనసాగవచ్చు.
అలాగే ఉత్తర మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు సాయంత్రం నుంచి , ఉత్తర బంగాళాఖాతంలో మే 20 , 2020న సముద్రం అసాధారణ స్థితిలో ఉండవచ్చు.
చేపలు పట్టే వారికి హెచ్చరిక:
మత్స్యకారులు రాగల 24 గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పక్కనే ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కి, అలాగే మధ్య బంగాళాఖాతం,ఉత్తర బంగాళాఖాతంలోకి 2020 మే 19 నుండి 20 వరకు ప్రవేశించ రాదని సూచించారు.
అలాగే, మత్స్యకారులు 2020 మే 20 వరకు ఉత్తర బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ , దాని ప్రక్కనే ఉన్న బంగ్లాదేశ్ తీరాలలోకి వెళ్లవద్దని సూచించారు.
నష్టం అంచనా , తీసుకోవలసిన చర్యలు:
(ఎ) పశ్చిమబెంగాల్ .(తూర్పు మిడ్నపూర్, ఉత్తర, దక్షిన 24 పరగణాల జిల్లాలు, హౌరా, హూగ్లి, కోల్‌కతా జిల్లాలలో నష్టం జరగవచ్చు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా సూచించడం జరిగింది.
అన్ని రకాల కచ్చా ఇళ్ళు, పాతవి, సరిగా నిర్వహించని పక్కా నిర్మాణాలు, గాలిలో ఎగిరిపోయే వాటికి ఎక్కువ నష్టంవాటిల్లే అవకాశం ఉంది.
కమ్యూనికేషన్ వ్యవస్థ , విద్యుత్ స్తంభాలు కుప్పకూలే అవకాశం ఉంది. రైలు,రోడ్డు మార్గాలు తెగిపోవచ్చు.
పంటలకు, వివిధ రకాల తోటలు, పండ్ల తోటలకు విస్తృతంగా నష్టం జరిగే అవకాశం ఉంది. పామాయిల్ , కొబ్బరి చెట్లు గాలికి కిందపడే అవకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద కొమ్మలు కలిగిన వృక్షాలు కూడా నేల కూలే అవకాశం ఉంది. లంగరు వేసిన పెద్ద పడవలు, నౌకల గొలుసులు తెంచుకునే ప్రమాదం ఉంది.
చేపలు పట్టేవారికి హెచ్చరికలు, సూచనలు.
--2020 మే 18 వతేదీ నుంచి 20 వ తేదీ వరకు మొత్తం చేపలు పట్టే కార్యకలాపాలను నిలిపివేయాలి.
--రైలు, రోడ్డు ట్రాఫిక్‌ను దారి మళ్ళించడం లేదా నిలిపివేయడం చేయాలి.
--తుపాను ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలు సురక్షిత ఇళ్ళలో ఉండాలి.
--మోటారు బోట్లు చిన్నపడవలు తిప్పడం మంచిది కాదు.
బి) ఒడిషా లో పలు ప్రాంతాలలో తుపాను కారణంగా నష్టం జరిగే అవకాశం ఉంది.( జగత్సింగ్‌పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, జైపూరర్, మయూర్‌భంజ్)
నష్టం జరిగే అవకాశం:
పూరిగుడిసెలు పూర్తిగా దెబ్బతినవచ్చు, కచ్చా ఇళ్లు పాక్షికంగా దెబ్బతినవచ్చు. గాలిలో ఎగిరిపోయే వస్తువులకు నష్టం వాటిల్లవచ్చు. విద్యుత్,కమ్యూనికేషన్ పోల్స్ వంగిపోవడం లేదా పెకలించుకుపోవడం జరగవచ్చు.
కచ్చా, పక్కా రోడ్లకు చాలా ఎక్కువ నష్టం వాటిల్లవచ్చు. రైల్వేలకు . ఓవర్ హెడ్ పవర్ లైన్స్, సిగ్నలింగ్ వ్యవస్థ కు స్వల్ప నష్టం వాటిల్ల వచ్చు.
పంటలకు, ప్లాంటేషన్లకు, పండ్ల తోటలకు, కొబ్బరితోటలకు నష్టం వాటిల్లవచ్చు. పెద్ద పెద్ద కొమ్మలు కలిగిన మామిడిచెట్లవంటివి పడిపోవచ్చు.
చిన్న పడవలు, నాటుపడవలు కట్టిపడేసినవి తెగిపోయి కొట్టుకుపోవచ్చు.
చేపలు పట్టేవారికి హెచ్చరికలు, సూచనలు.
--2020 మే 18 వతేదీ నుంచి 20 వ తేదీ వరకు మొత్తం చేపలు పట్టే కార్యకలాపాలను నిలిపివేయాలి.
--రైలు, రోడ్డు ట్రాఫిక్‌ను దారి మళ్ళించడం లేదా నిలిపివేయడం చేయాలి.
--తుపాను ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలు సురక్షిత ఇళ్ళలో ఉండాలి.
--మోటారు బోట్లు చిన్నపడవలు తిప్పడం మంచిది కాదు.
తాజా సమాచారం కోసం సంప్రదించండి: www.rsmcnewdelhi.imd.gov.in and www.mausam.imd.gov.in
(Release ID: 1625198)
Visitor Counter : 192