భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

ప‌శ్చిమ‌బెంగాల్, ఉత్త‌ర ఒడిషా తీరంపై ప్ర‌భావం చూప‌నున్న సూప‌ర్ సైక్లోన్ అంఫ‌న్

Posted On: 18 MAY 2020 8:15PM by PIB Hyderabad

 

భార‌త వాతావ‌ర‌ణ విభాగం, తుపాను హెచ్చ‌రిక కేంద్రం  (భార‌త కాల‌మానం ప్ర‌కారంం1900 గంట‌ల స‌మంయ‌లో విడుద‌ల  చేసిన  స‌మాచారం  ప్ర‌కారం, అంఫ‌న్  తుపాను 18 మే 2020 మ‌ధ్యాహ్నం తీవ్ర‌మై సూప‌ర్  తుపాను గా మారింది.  ఇది చాలా తీవ్ర తుపాను. దీని గాలి వేగం గంట‌కు 220 కిలోమీట‌ర్ల నుంచి 230 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఉంటుంది.
ఇది ప‌శ్చిమ బెంగాల్‌-బంగ్లాదేశ్ కోస్తా ప్రాంతాన్ని  ప‌శ్చిమ‌బెంగాల్‌లోని డిఘా , హ‌తియా దీవుల (బంగ్లాదేశ్‌) మ‌ధ్య   సుంద‌ర్‌బ‌న్స్‌కు ద‌గ్గ‌రలో 2020 మే 20 వ తేదీ మ‌ధ్యాహ్నం తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది.
ఇది తీరాన్ని  తాకే స‌మ‌యంలో  గంట‌కు 165 - 175 నుంచి 195 కిలోమీట‌ర్ల వేగంతో  వీచే గాలుల‌తో పెనుతుపానుగామారే అవ‌కాశం ఉంది.  దీని ప్ర‌భావం వ‌ల్ల ప‌శ్చిమ‌బెంగాల్ లోనిగంగా ప్రాంతంలో ప‌లు చోట్ల భారీ నుంచి అతి భారీ స్థాయిలో వ‌ర్షాలు ప‌డే అవకాశం ఉంది. అలాగే, ఉత్త‌ర ఒడిషాలో 19, 20 తేదీల‌లో అత్యంత భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది.
4-6 మీట‌ర్ల ఎత్తున ఎగ‌సిప‌డే అలల వ‌ల్ల ద‌క్షిణ‌, ఉత్త‌ర 24 ప‌ర‌గ‌ణాల జిల్లాలలో ప‌ల్లపు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. అలాగే తుపాను  తీరం దాటే స‌మ‌య‌యంలో  తూర్పు మిడ్న‌పూర్ జిల్లాలలోని లోత‌ట్టు ప్రాంతాల‌వ‌ద్ద అల‌లు 3 నుంచి 4 మీట‌ర్ల ఎత్తున   ఎగిసిప‌డే అవ‌కాశం ఉంది.
ఈ తుపాను పెద్ద ఎత్తున న‌ష్టాన్ని క‌లిగించే శ‌క్తి క‌లిగి ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున, విస్తృత‌స్థాయిలో న‌ష్టం కలిగిస్తుంది.
1) ప‌శ్చిమ‌బెంగాల్ లో న‌ష్ట తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌నుంది.(తూర్పు మిడ్న‌పూర్‌, ఉత్త‌ర‌, ద‌క్షిన 24 ప‌ర‌గ‌ణాల జిల్లాలు, హౌరా, హూగ్లి, కోల్‌క‌తా జిల్లాలలో న‌ష్టం జ‌ర‌గ‌వ‌చ్చు. ఇందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా సూచించ‌డం జ‌రిగింది.

అన్ని ర‌కాల క‌చ్చా ఇళ్ళు, పాత‌వి, స‌రిగా నిర్వ‌హించ‌ని ప‌క్కా నిర్మాణాలు, గాలిలో ఎగిరిపోయే  వాటికి ఎక్కువ న‌ష్టంవాటిల్లే అవ‌కాశం ఉంది.
క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ , విద్యుత్ స్తంభాలు కుప్ప‌కూలే అవకాశం ఉంది. రైలు,రోడ్డు మార్గాలు తెగిపోవ‌చ్చు.
పంట‌ల‌కు, వివిధ రకాల తోట‌లు, పండ్ల తోట‌లకు విస్తృతంగా న‌ష్టం జ‌రిగే అవకాశం ఉంది. పామాయిల్ , కొబ్బ‌రి చెట్లు గాలికి కింద‌ప‌డే అవకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద కొమ్మ‌లు క‌లిగిన వృక్షాలు కూడా నేల కూలే అవ‌కాశం ఉంది. లంగ‌రు వేసిన‌ పెద్ద ప‌డ‌వ‌లు, నౌక‌ల గొలుసులు తెంచుకునే ప్ర‌మాదం ఉంది.

చేప‌లు ప‌ట్టే వారికి హెచ్చ‌రిక‌, తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై సూచ‌న‌:
2020 మే నెల 18 వ తేదీ నుంచి 20 వ తేదీ వ‌ర‌కు చేప‌లు ప‌ట్టే కార్య‌క‌లాపాల‌ను నిలిపివేయ‌డం జ‌రిగింది.
రైలు , రోడ్డు ట్రాఫిక్‌ను ఇత‌ర ప్రాంతాల మీదుగా మ‌ళ్ళించ‌డం లేక నిలిపివేయ‌డం చేయాలి
తుపాను ప్ర‌భావం అధికంగా ఉన్న ప్రాంతాల‌లో ప్ర‌జ‌లు ఇండ్ల‌లోనే ఉండాలి. ప‌ల్ల‌పు ప్రాంతాల  ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాలి.
మోటారు బోట్లు, చిన్న‌చిన్న ప‌డ‌వలను తిర‌గ‌డానికి అనుమ‌తించ‌కూడ‌దు.
2) ఒడిషా లో ప‌లు ప్రాంతాల‌లో తుపాను కార‌ణంగా న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది.( జగ‌త్సింగ్‌పూర్‌, కేంద్ర‌పారా, భద్ర‌క్‌, బాలాసోర్‌, జైపూర‌ర్‌, మ‌యూర్‌భంజ్‌)
పూరిగుడిసెలు పూర్తిగా దెబ్బ‌తిన‌వ‌చ్చు, క‌చ్చా ఇళ్లు పాక్షికంగా దెబ్బ‌తిన‌వ‌చ్చు. గాలిలో ఎగిరిపోయే వ‌స్తువులకు న‌ష్టం వాటిల్ల‌వ‌చ్చు. విద్యుత్‌,క‌మ్యూనికేష‌న్ పోల్స్ వంగిపోవ‌డం లేదా పెక‌లించుకుపోవ‌డం జ‌ర‌గ‌వ‌చ్చు.
క‌చ్చా, ప‌క్కా రోడ్లకు చాలా ఎక్కువ న‌ష్టం వాటిల్ల‌వ‌చ్చు. రైల్వేల‌కు . ఓవ‌ర్ హెడ్ ప‌వ‌ర్ లైన్స్‌, సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ కు  స్వ‌ల్ప న‌ష్టం వాటిల్ల వ‌చ్చు.
పంట‌ల‌కు, ప్లాంటేష‌న్ల‌కు, పండ్ల తోట‌ల‌కు, కొబ్బ‌రితోట‌ల‌కు న‌ష్టం వాటిల్ల‌వ‌చ్చు. పెద్ద పెద్ద కొమ్మ‌లు క‌లిగిన మామిడిచెట్ల‌వంటివి ప‌డిపోవ‌చ్చు.
చిన్న ప‌డ‌వ‌లు, నాటుప‌డ‌వ‌లు క‌ట్టిప‌డేసిన‌వి తెగిపోయి కొట్టుకుపోవ‌చ్చు.
చేప‌లు ప‌ట్టేవారికి హెచ్చ‌రిక‌లు, సూచ‌న‌లు.
--2020 మే 18 వ‌తేదీ నుంచి 20 వ తేదీ వ‌ర‌కు మొత్తం చేప‌లు ప‌ట్టే కార్య‌క‌లాపాల‌ను నిలిపివేయాలి.
--రైలు, రోడ్డు ట్రాఫిక్‌ను దారి మళ్ళించ‌డం లేదా నిలిపివేయ‌డం చేయాలి.
--తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌లోని ప్ర‌జ‌లు సుర‌క్షిత ఇళ్ళ‌లో ఉండాలి.



(Release ID: 1625044) Visitor Counter : 121


Read this release in: English , Urdu , Hindi , Bengali