PIB Headquarters
మ్యూచువల్ ఫండ్స్‌పై లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్.బి.ఐ చర్యలు 50,000 కోట్ల రూపాయల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయం
Posted On:
27 APR 2020 3:26PM by PIB Hyderabad
మ్యూచువల్ ఫండ్స్‌పై లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించేందుకు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా,మ్యూచువల్ ఫండ్స్ కోసం రూ 50,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని ప్రకటించింది.రిజర్వుబ్యాంకు ఈ నిధులను బ్యాంకులకు తక్కువ రేటుకు అందిస్తుంది.బ్యాంకులు ఈ నిధులను కేవలం మ్యూచువల్ ఫండ్‌ల లిక్విడిటీ అవసరాలను తట్టుకునేందుకు వినియోగించుకోవచ్చు.
.ఈరోజునుంచి అమలులోకి వచ్చే ప్రత్యేక లిక్విడిటీ పథకం కింద, రిజర్వు బ్యాంకు 90రోజుల కాలపరిమితిగల రెపో కార్యకలాపాలను స్థిర రెపో రేటు వద్ద చేపడుతుంది. ఈ సదుపాయం ఆన్-ట్యాప్, ఒపెన్ -ఎండెడ్ గా ఉంటుంది. బ్యాంకులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజునైనా తమ బిడ్లను సమర్పించవచ్చు. ఈ పథకం మే 11 వరకు లేదా కేటాయించిన మొత్తం వినియోగించుకునే వరకు ఏది ముందు అయితే ఆ రోజువరకు అమలులో ఉంటుంది.
కోవిడ్ -19 కారణంగా కేపిటల్ మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనౌతున్నాయి. ఇది మ్యూచువల్ ఫండ్లపై లిక్విడిటీ ఒత్తిడిని కలుగ చేస్తోంది. కొన్ని డెట్ మ్యూచువల్ ఫండ్‌ల క్లోజర్‌కు సంబంధించి రిడమ్‌ప్షన్ ఒత్తిడులు తీవ్రమైన నేపథ్యంలో. వాటిప్రభావాలు అక్కడనుంచి ఒకదానిపై ఒకటిగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒడుదుడుకులు ఉంటున్నాయి. అని ఆర్.బి.ఐ తెలిపింది.
కోవిడ్ -19 ఆర్థిక ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలూతీసుకునేందుకు రిజర్వ్యు బ్యాంకు అప్రమత్తంగా ఉంటుందని,అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుందని కూడా ఆ ప్రకటన పేర్కొనింది.
మ్యూచువల్ ఫండ్ల వద్ద గల ఇన్వెస్ట్‌మెంట్‌గ్రేడ్ కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు (సిపిలు) డిబెంచర్లు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ల కొలేటరల్‌పై ఏకమొత్త కొనుగోళ్లు లేదా రెపోలకు అండర్‌టేకింగ్ ద్వారా ,స్పెషల్ లిక్విడిటీ ఫండ్ -మ్యూచువల్ ఫండ్ (ఎస్ఎల్ ఎఫ్- ఎం.ఎఫ్) కింద అందుబాటులోకి వచ్చిన నిధులను , బ్యాంకులు ప్రత్యేకంగా లోన్లు ఇవ్వడం ద్వారా మ్యూచువల్ ఫండ్‌ల లిక్విడిటీ అవసరాలు తీర్చాలి.
(Release ID: 1618887)