భారత పోటీ ప్రోత్సాహక సంఘం
అదానీ గ్రీన్ ఎనర్జీ, టోటల్ ఎస్.ఏ.ల ఉమ్మడి విద్యుత్తు సంస్థ ఏర్పటుకు సీసీఏ పచ్చజెండా
భారత్‌లో సౌరశక్తి ద్వారా విద్యుత్తు ఉత్పత్తకి లైన్ క్లియర్
Posted On:
01 APR 2020 7:50PM by PIB Hyderabad
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరియు టోటల్ ఎస్.ఎ. సంస్థలు సంయుక్తంగా కలిసి భారత్‌లో సౌరశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేయదలచిన జాయింట్ వెంచర్ (ఉమ్మడి సంస్థ) ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తన ఆమోదాన్ని తెలిపింది. ఈ రెండు సంస్థల జేవీ ప్రతిపాదనలో భాగంగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తన అనుబంధ సంస్థలలో కొన్నింటిని కొత్తగా ఏర్పాటు చేసే ఉమ్మడి సంస్థకు బదిలీ చేయనుంది. తదనంతరం టోటల్ ఎస్.ఎ. సంస్థ ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ జేవీ సంస్థలో 50 శాతం మేర ఈక్విటీ క్యాపిటల్‌ను కొనుగోలు చేయనుంది. టోటల్ ఎస్.ఎ. సంస్థ అంతర్జాతీయంగా పేరున్న టోటల్ గ్రూపు మాతృ సంస్థ. టోటల్ గ్రూప్ అంతర్జాతీయ సమీకృత విద్యుత్తు ఉత్పత్తి రంగంతో పాటు చమురు మరియు గ్యాస్ రంగంలోనూ మేటి సంస్థగా వ్యాపార సేవలనందిస్తోంది. టోటల్ గ్రూపు సంస్థ భారత్‌లో పునరుత్పాదక ఇంధనోత్పత్తితో పాటు విద్యుత్తు ఉత్పత్తి రంగంలోనూ పాలుపంచుకుంటోంది. మరోవైపు ఆదానీ సంస్థ కూడా ఆయా రంగాలలో నిమగ్నమై ఉన్న విషయం తెలిసిందే.
(Release ID: 1610136)
Visitor Counter : 103