మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

లాక్డౌన్ వేళ “స్వయం” అభ్యాసానికి ఆదరణ

సర్కారు డిజిటల్ అభ్యాస వేదికలకు మూడు రెట్ల స్పందన

-హెచ్ఆర్ఢీ శాఖ మంత్రి శ్రీ రమేశ్ పొఖ్రియాల్

Posted On: 28 MAR 2020 2:23PM by PIB Hyderabad

న్యూఢిల్లీః దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్ఢీ) వివిధ ఆన్‌లైన్ / డిజిటల్ ఎడ్యుకేషన్ చర్యలతో విద్యార్థులు ఇంట్లోనే కూర్చొని విద్య నేర్చుకొనేలా వివిధ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. లాక్డౌన్ నేపథ్యంలో హెచ్ఆర్ఢీ శాఖ అందుబాటులోకి తెచ్చిన వివిధ ఆన్లైన్ అభ్యాస వేదికలను విద్యార్థులు మరింతగా సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హెచ్ఆర్ఢీ శాఖ మంత్రి శ్రీ రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులు తమ విలువైన సమయాన్నిగరష్ఠంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో హెచ్ఆర్డీ ఆన్లైన్ అభ్యాస వేదికలకు మేటి స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు.

వారంలో మూడు రెట్లు పెరిగిన వినియోగం

జాతీయ ఆన్లైన్ విద్యా వేదికలకు ఇతర డిజిటల్ విద్యా విధానాలకు గడిచిన వారం రోజుల్లో అనూహ్యమైన స్పందన లభించిందని మంత్రి తెలిపారు. ఆన్లైన్ విద్యా వేదికల వాడకం గత వారం రోజుల్లో మూడు రెట్లుగా పెరిగినట్టు మంత్రి వివరించారు. హెచ్ఆర్డీ పరిధిలో పనిచేస్తున్న ఉత్తమ బోధన, అభ్యాస వనరుల వేదిక స్వయంను (SWAYAM) వాడుకొనేందుకు ఉచిత వాడకపు అనుమతులు జారీ చేసినప్పటి నుంచి ఈ వేదికను వాడుతున్న వారి సంఖ్యలో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని ఆయన అన్నారు. అంతకుముందు స్వయం వాడకానికి ముందస్తు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ కాలంను మరింత ఉత్పాదకంగా ఉపయోగించుకొనేందుకు, ఆన్లైన్ లెర్నింగ్ ను ప్రొత్సహించడానికిగాను స్వయంను ఎవరైనా ఉచితంగా వాడుకొనే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి వివరించారు. ఈ నెల 23 నుంచి దాదాపు అర లక్ష మంది స్వయం వేదికను యాక్సెస్ చేశారని ఆయన తెలిపారు. స్వయం వేదికపై జనవరి 2020తో ప్రారంభమైన సెమిస్టరుకు అందుబాటులో ఉంచిన 571 కోర్సుల్లో నమోదైన దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు, అభ్యాసకులకు ఈ సంఖ్య అదనమని ఆయన తెలిపారు.

భారత్ తో సహా 60 దేశాల్లో వాడకం..

స్వయం 1900 కోర్సులకు సంబంధించిన ఆన్లైన్ అభ్యాసిక వేదికగా విద్యార్థులకు తోడ్పడుతోంది. దీనిని దాదాపు 60 దేశాలలోని ప్రజలు యాక్సెస్ చేస్తున్నారు.  ప్రధానంగా భారత్ తో పాటు అమెరికా, యూఏఈ, జర్మనీ, నేపాల్, సింగపూర్, కెనడా, యూకే, అస్ట్రేలియాలలోని విద్యార్థులు  స్వయం ద్వారా తమ విద్యా సంపదను పెంపొందించుకుంటున్నారు.  స్వయం ప్రభ వీడియోలు డీటీహెచ్ టీవీ ఛానెల్ ద్వారా ప్రతిరోజూ దాదాపు 50,000 మంది వీక్షిస్తున్నారు. దీనికి తోడు నేషనల్ డిజిటల్ లైబ్రెరీని (ఎన్డీఎల్)రోజుకు దాదాపు 43,000 మంది వినియోగించుకుంటున్నారు. ఇది గతంలో నిత్యం ఎన్డీఎల్ సేవలను వాడుకుంటున్న వారికంటే కూడా దాదాపు రెట్టింపు కావడం విశేషం.

ఎన్.సి.ఆర్.టి. ఎడ్యుకేషన్ పోర్టల్స్ తాకిడి..

ఎన్.సి.ఆర్.టి. ఎడ్యుకేషన్ పోర్టల్స్ అయిన దీక్ష,  ఈ-పాఠశాల, ఎన్.ఆర్.ఒ.ఈ.ఆర్, ఎన్.ఐ.ఒ.ఎస్ తో పాటుగా ఇతర ఐసీటీ విద్యావేదికలైన రోబోటిక్ ఎడ్యుకేషన్ (ఈ-యంత్ర), ఓపెన్ సొర్స్ సాఫ్ట్వేర్ ఫర్ ఎడ్యుకేషన్ (ఫోస్సీ), వర్చువల్ ఎక్స్పెరిమెంట్స్ (వర్చువల్ ల్యాబ్స్) మరియు లెర్నింగ్ ప్రొగ్రామింగ్ (స్పొకెన్ ట్యుటోరియల్) వంటి డిజిటల్ లెర్నింగ్ వేదికలను వాడుకొంటున్న వారి సంఖ్య కూడా లాక్డౌన్ కాలంలో వాడుకుంటున్న వారి సంఖ్యలో విశేషమైన వృద్ధి కనిపిస్తోందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో హెచ్ఆర్డీ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆన్లైన్ విద్యాభ్యాస వేదికనలు విద్యార్థులు మరింత గరిష్టంగా సమర్థమంతంగా వినియోగించుకొని విద్యార్థులు తమ అభ్యాస అనుభవాల్ని మెరుగుపరుచుకోవాలని పొఖ్రియాల్ కోరారు.



(Release ID: 1608927) Visitor Counter : 139


Read this release in: English