రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 ను నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ముఖ్యంగా రైల్వే వినియోగదారులకు వచ్చే సందేహాలను తీర్చడానికి, వారికి సమాచారాన్ని వేగంగా అందించడానికిగాను భారతీయ రైల్వే రెండు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. 138, 139 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. ఇవి 24 గంటలూ సేవలందిస్తున్నాయి. అంతే కాదు ప్రజలు అందించే సూచనల్ని సలహాల్ని కూడా రైల్వే శాఖ తీసుకుంటోంది.
Posted On:
27 MAR 2020 6:51PM by PIB Hyderabad
కోవిడ్ 19 కు సంబంధించి ప్రజలు తమ తమ మాతృభాషల్లో అడిగే ప్రశ్నలకు కూడా వీటి ద్వారా సమాధానం చెబుతున్నారు.
ఈ హెల్ప్ లైన్లను నిర్వహించడానికిగాను రైల్వే బోర్డ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేశారు. తద్వారా రైల్వే సిబ్బందికి, ప్రజలకు మధ్యన సమాచారం ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడానికి కృషి చేస్తున్నారు. డైరెక్టర్ స్థాయి అధికారి ఈ సెల్‌కు ఇంచార్జిగా నియమించారు. కోవిడ్ 19కుం సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే సమాచారంలోని మంచి చెడ్డలను కూడా రైల్వే బోర్డ్ కంట్రోల్ సెల్ అధ్యయనం చేసి తమ వినియోగదారులు, ఇతరులు తప్పుడు సమాచారం బారిన పడకుండా చూస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా railmadad@rb.railnet.gov.in అనే ఈ మెయిల్ అడ్రస్సుకు రాయవచ్చని అధికారులు తెలిపారు.
139 కేంద్రీయంగా పని చేసే హెల్ప్ లైన్. 138 ఆయా రైల్వే డివిజన్లలోని పోన్ కాల్స్‌ను తీసుకొని వాటికి ఆయా స్థానిక భాషల్లో సమాధానం ఇస్తుంది. 138, 139 లతోపాటు సోషల్ మీడియా సెల్ 24 గంటలూ పని చేస్తూ ప్రజల సందేమాలకు సమాధానమిస్తున్నాయి. రీఫండ్, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోను, రైల్వే శాఖ వద్దా వున్న వైద్య సౌకర్యాల సమాచారాన్ని ప్రజలకు అందిస్తారు. అంతే కాదు స్థానికంగా, ప్రాంతీయంగా, జాతీయ స్థాయిలో కోవిడ్ 19 హెల్ప్ లైన్ల సమాచారాన్ని కూడా ప్రజలకు అందజేయడం జరుగుతోంది.
...........
(Release ID: 1608703)
Visitor Counter : 131