ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలతో డాక్టర్ హర్షవర్ధన్ వీడియో కాన్ఫెరెన్స్
"కష్టపడి శ్రద్ధపూర్వకంగా మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం ": డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
06 MAR 2020 6:09PM by PIB Hyderabad
కరోనా వైరస్ ని ఎదుర్కోడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కొనియాడారు. తాజా పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర మంత్రి రాష్ట్రాల వైద్య శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, బ్యూరో అఫ్ ఇమిగ్రేషన్, పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించిన పర్యాటక సూచనా సలహాల మార్గదర్శకాలను కూడా ఈ సమావేశంలో వివరించారు. సంబంధిత విమానాశ్రయాల ప్రజారోగ్య అధికారులు, ఎయిర్పోర్ట్ మేనేజర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీక్షించాలని రాష్ట్రాలను కేంద్ర మంత్రి కోరారు.
ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్ లు, ఇతర మౌలిక సౌకర్యాల సంసిద్ధత, చర్యలను డాక్టర్ హర్షవర్ధన్ సమీక్షించారు. ఇందుకు పని చేస్తున్న సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ చర్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఇందుకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, అధ్యయన గోష్ఠుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వివరించాయి. ప్రజలు చేపట్టే మౌలిక ఆరోగ్య పరిరక్షణ చర్యలు, జాగ్రత్తలు సవివరంగా మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ఆయా అధికారులు వివరించారు. ఈ మొత్తం కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులను విస్తృతంగా భాగస్వామ్యులయ్యేలా చూడాలని సూచించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డిజిహెచ్ఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
****
(Release ID: 1607056)
Visitor Counter : 90