సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ సూచనలు
Posted On:
03 MAR 2020 8:14PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సలహాలు మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ అన్ని ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్ళు, అన్ని ప్రైవేట్ ఎఫ్.ఎం రేడియో చానెళ్లకు కు కొన్ని సూచనలు జారీ చేసింది. ఈ సూచనల ఆధారంగా ప్రైవేట్ ఛానళ్ళు వారి మాధ్యమాల ద్వారా ప్రజలలో విస్తృతంగా అవగాహన, చైతన్యాన్ని కల్పించాలని కేంద్ర సమాచార ప్రసారాలు మంత్రిత్వ శాఖ కోరింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సవరించిన మార్గదర్శకాలు, సూచనలను విస్తృతంగా ప్రచారం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. మార్గదర్శకాలు, సూచనల విస్తృత సమాచారం ఐ&బి మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో లభిస్తుంది.
https://mib.gov.in/sites/default/files/Advisory%20on%20COVID19.pdf
*****
(Release ID: 1607054)
Visitor Counter : 113