ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 తాజా పరిణామాలు

Posted On: 13 MAR 2020 10:53PM by PIB Hyderabad

   శ్చిమ ఢిల్లీలో 68 ఏళ్ల మహిళ (కోవిడ్‌-19 నిర్ధారిత వ్యక్తి తల్లి) మరణించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, అప్పటికే వ్యాధిగ్రస్థురాలైన (మధుమేహం, రక్తపోటు) ఆమెకు కోవిడ్‌-19 కూడా సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్‌ సోకిన వ్యక్తి (ఆమె కుమారుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 22వ తేదీవరకూ స్విట్జర్లాండ్‌, ఇటలీల్లో పర్యటించి 23వ తేదీన స్వదేశం వచ్చారు)తో కలసి ఉండటమే ఇందుకు కారణమని తేలింది. అతడు తిరిగిరాగానే పరీక్షలు నిర్వహించినప్పుడు వైరస్‌ సోకిన లక్షణాలు కనిపించలేదు. కానీ, ఒకరోజు తర్వాత తీవ్ర జ్వరం, దగ్గు రాగా, 2020 మార్చి 7వ తేదీన ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి వచ్చాడు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం అతనితోపాటు జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతని తల్లికీ వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో చేర్చుకున్నారు. అతని తల్లి అంతకుముందే వ్యాధిగ్రస్థురాలు కావడంతో మార్చి 8వ తేదీన రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా కోవిడ్‌-19 సోకినట్లు తేలింది. మరునాటికల్లా ఆమెకు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి, న్యుమోనియా రావడంతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు తరలించి కృత్రిమ శ్వాస అందించారు. కానీ, వ్యాధిగ్రస్థురాలైన ఆమెకు కోవిడ్‌-19 కూడా సోకడంతో మార్చి 13వ తేదీన తుదిశ్వాస విడిచారు.


*****



(Release ID: 1607019) Visitor Counter : 160


Read this release in: English , Hindi