ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఫిబ్రవరి 16న బడ్జెట్ 2020 పై ఇంటరాక్టివ్ సెషన్లలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Posted On: 14 FEB 2020 6:00PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 16, 2020 న హైదరాబాద్ రానున్నారు. పరిశ్రమ ప్రతినిధులు, వాణిజ్య సంస్థలు, పెట్టుబడి బ్యాంకర్లు మరియు రైతు సంస్థలతో సమావేశమై పార్లమెంటులో ఫిబ్రవరి 1 వ తేదీన ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ 2020-21 లోని వివిధ ఇతివృత్తాలు, నిబంధనలపై ఆర్థిక మంత్రి మాట్లాడుతారు.. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలకు సంబంధించి ఆర్థికవేత్తలు, టాక్స్ ప్రాక్టీషనర్ అసోసియేషన్లు, ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ సంస్థలు, ప్రొఫెషనల్ బాడీలు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు మరియు అనేక ఇతర అభిప్రాయ నాయకులతో ఆర్థిక మంత్రి మరో వివరణాత్మక ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించనున్నారు.

 

ఆర్థిక మంత్రి కార్యదర్శి (వ్యయం), కార్యదర్శి (రెవెన్యూ), కార్యదర్శి (ఆర్థిక సేవలు), కార్యదర్శి (ఆర్థిక వ్యవహారాలు), చైర్‌పర్సన్, పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ కేంద్ర బోర్డు (సిబిఐసి) మరియు చైర్‌పర్సన్, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు,( సిబిడిటి) ఈ సెషన్లలో పాల్గొంటారు.

 

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గత వారం ముంబై, చెన్నై మరియు కోల్‌కతాలో ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించారు. వాటాదారులతో చర్చల తరువాత, కేంద్ర మంత్రి విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.

 

 


(Release ID: 1603261) Visitor Counter : 144


Read this release in: English