PIB Headquarters

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ – భిన్నత్వంలో ఏకత్వం , ఓ వేడుక- యువజన సేవల డైరెక్టర్ అబ్దుల్ అజీమ్

హైదరాబాద్ ఓ మినీ భారత్- ఎస్. వెంకటేశ్వర్, డిజి, పిఐబి

Posted On: 09 JAN 2020 7:00PM by PIB Hyderabad

"ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" మన దేశ భిన్నత్వంలో ఏకత్వం ఓ పండుగలా జరుపుకోవడమే అని తెలంగాణ రాష్ట్ర యూత్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ మొహమ్మద్ అబ్దుల్ అజీమ్ అన్నారు.నెహ్రూ యువ కేంద్ర సంగథన్, తెలంగాణ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్వివిధ రాష్ట్రాల సంస్కృతిసంప్రదాయాలు, అభ్యాసాల పరిజ్ఞానం పరస్పరం పంచుకోవడం వల్లన రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన మరియు బంధానికి దారితీస్తుందనితద్వారా భారతదేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతను బలపరుస్తుందని శ్రీ నజీమ్ అన్నారు.

 

పిఐబి డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఓ మినీ భారత్ అని ఇక్కడ వివిధ సంస్కృతులువిభిన్న ఆహార అలవాట్లు ఉన్నాయన్నారు. సంస్కృతిపర్యాటక రంగంభాషవిద్య మరియు పౌరులు సాంస్కృతిక వైవిధ్యాన్ని అలవర్చుకొనే  వార్షిక కార్యక్రమాలలో వివిధ రాష్ట్రాలు మరియు జిల్లాలను అనుసంధానించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

 

ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమానికై  తెలంగాణ మరియు హర్యానా రాష్ట్రాలు జతచేయబడ్డాయిఈ కార్యక్రమం జనవరి న ప్రారంభమై  జనవరి 23, 2020 వరకు కొనసాగుతుంది.



(Release ID: 1598971) Visitor Counter : 109


Read this release in: English