PIB Headquarters

2019- 2020 వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఢాయీ ఆఖర్లేఖా రచన ప్రచారం

Posted On: 02 JAN 2020 7:14PM by PIB Hyderabad

2018- 2019 వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఢాయీ ఆఖర్ లేఖా రచన ప్రచారం దేశ వ్యాప్తంగా 9 లక్షలకు పైగా ఎంట్రీలను ఆకట్టుకొని, మరి అలాగే తెలంగాణ సర్కిల్ లో 1,06,872 ఎంట్రీల తో గొప్పగా విజయవంతం అయింది. తెలంగాణ సర్కిల్ దేశం లో 2వ స్థానం లో నిలచిందని తపాలా విభాగం తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ తెలిపారు. ఈ సంవత్సరం లో కూడా తపాలా విభాగం జాతీయ స్థాయిలో ఢాయీ ఆఖర్ లేఖా రచన ప్రచారాన్ని నిర్వహిస్తోందని వెల్లడించారు. దీనికి ‘‘ప్రియమైన బాపూ, మీరు అమరులు..’’ అనేది ఇతివృత్తంగా ఉంటుంది. ఈ క్యాంపెయిన్ లో పాలు పంచుకొనే వారు వారి స్వీయ దస్తూరి తో ఇంగ్లిషు/హిందీ/స్థానిక భాష లలో వ్రాసిన లేఖల ను చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్- 500001 చిరునామా కు ఈ నెల 31వ తేదీ లోపు అందేలా పంపించాలి. వారు వారి పేరు, పూర్తి వయస్సు, మొబైల్ నంబర్, చిరునామా మరియు పిన్ కోడ్ లను కూడా వ్రాయాలి. లేఖ ఎ- 4 సైజు తెల్ల కాగితం పైన 1000 పదాలకు మించకుండా గాని, లేదా ఇన్ ల్యాండ్ లెటర్ పైన అయితే గనక 500 పదాలకు మించకుండా వ్రాయవలసి ఉంటుంది. ఈ లేఖలను జిల్లా కేంద్రాలు, పెద్ద పట్టణాలు/ నగరాల లోని తపాలా కార్యాలయాల వద్ద ‘‘లేఖారచన ప్రచారానికి’’ అనే సూచనతో ఉంచిన ప్రత్యేక లెటర్ బాక్స్ లో వేయాలి. గ్రామీణ ప్రాంతాల లేఖలను బ్రాంచి పోస్టాఫీసుల లో పోస్టు చేయాలి. ఈ పోటీ ని అన్ని వయో వర్గాలకు చెందిన అభ్యర్థులు అందరికి కూడాను ఉద్దేశించారు. ఇన్ ల్యాండ్ లెటర్ కార్డ్ కేటగిరి మరియు ఎన్వలప్ కేటగిరి లలో ప్రచారానికి 18 ఏళ్ల వయస్సు కేటగిరి మరియు 18 సంవత్సరాలకు మించిన వయస్సు (01.01.2020 నాటికి) కేటగిరి లు ఉన్నాయి. రాష్ట్రం/సర్కిల్ మరియు జాతీయ స్థాయిలలో ప్రతి ఒక్క కేటగిరి లో 3 ఉత్తమ ఎంట్రీలను ఎంపిక చేస్తారు. రాష్ట్రం లో ప్రతి ఒక్క కేటగిరి లో 3 ఎంట్రీలను 29.02.2020 కల్లా ఎంపిక చేస్తారు. అలాగే జాతీయ స్థాయి లో ప్రతి ఒక్క కేటగిరి లో 3 ఎంట్రీలను 31.03.2020 కల్లా ఎంపిక చేస్తారు. రెండు కేటగిరి ల వయో వర్గాల కు బహుమతులను ప్రదానం చేస్తారు. బహుమతులు రెండు కేటగిరిలలోను- అంటే 18 ఏళ్ల వయస్సు కేటగిరి లో మరియు 18 సంవత్సరాలకు పైబడిన వయస్సు కేటగిరిలోను- ఇన్ ల్యాండ్ లెటర్ కేటగిరి లో, అలాగే ఎన్ వలోప్ కేటగిరి లో ఈ క్రింది విధం గా ఉంటాయి.

 

 

ప్రతి ఒక్క కేటగిరి లో మొదటి బహుమతి అఖిల భారత స్థాయి లో 50,000 రూపాయలు నగదు, రాష్ట్ర స్థాయి లో 20,000 రూపాయలు నగదు గాను; ప్రతి ఒక్క కేటగిరి లో రెండో బహుమతి అఖిల భారత స్థాయి లో 25,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి లో 10,000 రూపాయలు గాను; ప్రతి ఒక్క కేటగిరి లో మూడో బహుమతి అఖిల భారత స్థాయి లో 10,000 రూపాయలు నగదు, రాష్ట్ర స్థాయి లో 5,000 రూపాయలు నగదు గాను ఉంటాయి. మరిన్ని వివరాలు https://telanganapostalcircle.in వెబ్ సైట్ లో లభ్యం అవుతాయి అని తపాలా విభాగం చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ (తెలంగాణ సర్కిల్, హైదరాబాద్) వివరించారు.

 

 

**


(Release ID: 1598332)
Read this release in: English