PIB Headquarters

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్ఒబి ఆధ్వర్యం లో ఛాయాచిత్ర ప్రదర్శన 

నాడు పోస్టు చేయడమైనది: 06 DEC 2019 7:02PM by PIB Hyderabad

డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సంద‌ర్భం గా స‌మాచార- ప్ర‌సార మంత్రిత్వ శాఖ లోని రీజ‌న‌ల్ అవుట్ రీచ్ బ్యూరో, హైద‌రాబాద్ ఈ రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయం, కవాడిగూడ లో అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న ను ఏర్పాటు చేసింది.

 

స‌మాచార- ప్ర‌సార మంత్రిత్వ శాఖ లో భాగ‌మైన ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం (పిఐబి), హైద‌రాబాద్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ శ్రీ ఎస్‌. వెంక‌టేశ్వ‌ర్ ఛాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న ను ప్రారంభించారు. డా. బి.ఆర్ అంబేద్కర్ అందించిన సేవలను ఆయన 63 వ వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

 

 

ఎగ్జిబిషన్ లో అంబేద్కర్ కు చెందిన అరుదైన న‌లుపు- తెలుపు ఛాయాచిత్రాలు ఉంచారు. ఈ కార్య‌క్ర‌మంలో పిఐబి డిప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ పి. రత్నాకర్, ఆర్ఒబి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మాన‌స్ కృష్ణ‌కాంత్‌ తో పాటు ఆర్ఒబి అధికారులు హాజ‌ర‌య్యారు.

 

****


(రిలీజ్ ఐడి: 1595374) సందర్శకుల సూచీ సంఖ్య : : 227
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English