కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

టెలికం సేవ‌ల రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ప‌ర‌మైన‌టువంటి ఒత్తిడి ని త‌గ్గించేందుకు ఉద్దేశించిన ప్ర‌తిపాద‌న ను ఆమోదించిన మంత్రిమండలి

Posted On: 20 NOV 2019 10:38PM by PIB Hyderabad

టెలికం సేవ‌ల రంగం యొక్క ఆర్థిక ప‌ర‌మైన ఒత్తిడి ని దిగువన పేర్కొన్న విధం గా తగ్గించే ప్ర‌తిపాద‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది:

2020-21 మ‌రియు 2021-22 సంవ‌త్స‌రాల కు గాను స్పెక్ట్ర‌మ్ వేలం కిస్తీ ల బ‌కాయిల చెల్లింపు ను అయితే ఒక సంవ‌త్స‌రం గాని లేదా రెండు సంవ‌త్స‌రాల పాటు గాని  వాయిదా వేసే ఒక ఐచ్ఛికాన్ని టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ (టిఎస్‌పి స్)కు దూర సంచార విభాగం (డిఒటి) ఇస్తుంది.  ఈ వాయిదా వేసిన‌టువంటి మొత్తాల బిల్లు ను టిఎస్‌పి లు చెల్లించ‌వ‌ల‌సి ఉన్న మిగిలిన కిస్తీల లో స‌రి స‌మానం గా విస్తరించడం జ‌రుగుతుంది.  సంబంధిత స్పెక్ట్ర‌మ్ ను వేలం వేసిన‌ప్పుడు నిర్దేశించిన వ‌డ్డీ ని మాత్రం వ‌సూలు చేయ‌డం జ‌రుగుతుంది.  త‌ద్వారా ఎన్‌పివి ని ప‌రిర‌క్షించిన‌ట్లు అవుతుంది.

స్పెక్ట్ర‌మ్ వేలం కిస్తీ ల వాయిదా తో టిఎస్‌పి ల‌కు కేశ్ అవుట్ ఫ్లో భారం త‌గ్గుతుంది.  అంతేకాదు, అవి బ్యాంకు రుణాల కు వ‌డ్డీ ని మ‌రియు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన అప్పుల చెల్లించడాని కి మార్గం సుగ‌మం అవుతుంది.  టిఎస్‌పి లు వాటి కార్య‌క‌లాపాల ను కొన‌సాగించ‌డం వ‌ల్ల ఉద్యోగాల కు మ‌రియు ఆర్థిక వృద్ధి కి ఊతం ల‌భిస్తుంది.  టిఎస్‌పి ల ఆర్థిక స్వ‌స్థ‌త మెరుగు ప‌డి వినియోగ‌దారుల కు నాణ్య‌త క‌లిగిన సేవ‌ల ను కొన‌సాగించ‌డానికి కూడా వీలు ఉంటుంది.

స్పెక్ట్ర‌మ్ కిస్తీ ల చెల్లింపు ను రెండు సంవ‌త్స‌రాల పాటు వాయిదా వేసే నిర్ణ‌యాన్ని ప‌క్షం రోజుల లోప‌ల అమ‌లులోకి తీసుకురావడం జ‌రుగుతుంది.  మాన్య క‌మ్యూనికేశ‌న్స్ శాఖ మంత్రి ఆమోదాన్ని తీసుకొని, లైసెన్స్ కు స‌వ‌ర‌ణ ను త్వ‌రిత‌ గ‌తి న జారీ చేయ‌డం జ‌రుగుతుంది.


**


(Release ID: 1592890) Visitor Counter : 81


Read this release in: English , Urdu , Hindi , Tamil