సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహాత్ముడి 150 వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ‘‘మన మహాత్ముడు’’ చిత్ర ప్రదర్శన
प्रविष्टि तिथि:
30 SEP 2019 7:30PM by PIB Hyderabad
మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, హైదరాబాద్ వారు "మన మహాత్ముడు" ఛాయాచిత్ర ప్రదర్శనను మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన 5 రోజుల పాటు అనగా, అక్టోబర్ 01 వ తేదీ నుండి 05 వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ రీజనల్ మేనేజర్ శ్రీ బి.వరప్రసాద్ ప్రారభించనున్నారు.
ఈ చిత్ర ప్రదర్శనలో గాంధీజీ బాల్యం నుండి జరిగిన ఘటనలకు సంబంధించిన అరుదైన చిత్రాలను ప్రదర్శిస్తారు. గాంధీజీ బాల్యంలో చదివిన ఆల్ఫ్రెడ్ హై స్కూల్, చంపారన్ సత్యాగ్రహం, గాంధీజీ జైలు జీవితం గడిపిన ఎరవాడ జైలు, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటి తో పాటు మన స్వాతంత్య్రోద్యమం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసే 50కి పైగా చిత్రాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. వీటితో పాటుగా 1942 నుండి 1947 వరకు జరిగిన చివరి దశ ఉద్యమంలో గాంధీజీ కీలక పాత్ర ప్రత్యేకతలను కూడా ఈ చిత్ర ప్రదర్శన తెలియ జేస్తుంది. దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వస్తున్న గాంధీజీ, కస్తూర్బా ల అనేక అపురూప చిత్రాలు ప్రదర్శనలో ఏర్పాటు చేస్తారు.
ఈ చిత్ర ప్రదర్శన సందర్బంగా కేంద్ర గేయ నాటక విభాగం వారి సాంస్కృతిక
కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యకమం లో శ్రీ వెంకటేశ్వర్ అదనపు డైరెక్టర్ జనరల్ , పత్రికా సమాచార కార్యాలయం, శ్రీ ఎం. దేవేంద్ర, డైరెక్టర్, ఆర్ఒబి, పి.రత్నాకర్, డిప్యూటీ డైరెక్టర్, పి.ఐ.బి , డాక్టర్ మానస్ కృష్ణకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్ఒబి, శ్రీ ఐ. హరిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్ఒబి, శ్రీ కోటేశ్వర్ రావు, ఎఫ్ పిఒ, ఆర్ఒబి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు.
****
(रिलीज़ आईडी: 1586771)
आगंतुक पटल : 132
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English