హోం మంత్రిత్వ శాఖ
ఎస్.వి.పి జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరి౦చిన శ్రీ అభయ్
నాడు పోస్టు చేయడమైనది:
17 JUL 2019 6:13PM by PIB Hyderabad
1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపిఎస్ అధికారి శ్రీ అభయ్ ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఒడిశాలో క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్యాచ్ కు శ్రీ అభయ్ నాయకత్వం వహించారు. సిబిఐ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, సిఆర్‌పిఎఫ్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా కూడా ఆయన పనిచేశారు. సిబిఐలో తన ఏడేళ్ల పదవీకాలంలో బ్యాంక్ మోసాలు, సెక్యూరిటీ సెల్ డిఐజి గా న్యూఢిల్లీలో పని చేశారు
మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, రష్యా మరియు ఇండోనేషియాతో స౦స్థాగత స్థాయి చర్చలకు శ్రీ అభయ్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు మరియు మాదకద్రవ్యాలపై యుఎన్ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
శ్రీ అభయ్ అ౦ది౦చిన ప్రతిభావ౦తమైన సేవలకై భారత పోలీసు పతకం , విశిష్ట సేవలు అ౦ది౦చిన౦దుకు గాను ప్రెసిడె౦ట్స్ మెడల్ అందుకున్నారు.
పోలీస్ అకాడమీలో విలేకరుల సమావేశంలో శ్రీ అభయ్ మాట్లాడుతూ ప్రస్తుతం 350 మంది ఐపిఎస్ అధికారులకు ఎన్‌పిఎలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సైబర్, ఆర్థిక నేరాల దర్యాప్తును బలోపేతం చేసేవిధ౦గా ప్రాధాన్యతనివ్వనున్నట్లు శ్రీ అభయ్ తెలిపారు.
--
(రిలీజ్ ఐడి: 1579296)
సందర్శకుల సూచీ సంఖ్య : : 128