మంత్రిమండలి
ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) బిల్లు, 2019కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
10 JUL 2019 6:07PM by PIB Hyderabad
ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) బిల్లు, 2019 ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. పార్లమెంటు రాబోయే సమావేశాల లో బిల్లు ను ప్రవేశపెడతారు.
వారి యొక్క సామాజిక, ఆర్థిక మరియు విద్య సంబంధిత సాధికారిత కు ఒక యంత్రాంగాన్ని బిల్లు సమకూర్చుతుంది.
ప్రభావం
పెద్ద సంఖ్య లో గల ట్రాన్స్ జెండర్ పర్సన్స్ కు బిల్లు లబ్ధి ని చూకూర్చుతుంది. వారి పట్ల సమాజం లో నెలకొన్న కళంకాన్ని, వివక్ష ను మరియు వారి పట్ల సమాజం లో నెలకొన్న అనుచిత ధోరణుల ను బిల్లు రూపు మాపుతుంది. అంతే కాకుండా, వారి ని సమాజం లోని ప్రధాన స్రవంతి లోకి తీసుకు రావడమే కాక అన్ని వర్గాల ను కలుపుకొని పోవడానికి దోహద పడుతుంది. సమాజం లో నిర్మాణాత్మక సభ్యులు గా ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ను తీర్చిదిద్దుతుంది.
పూర్వరంగం
ట్రాన్స్ జెండర్ సముదాయం పురుషులు లేదా మహిళల కేటగిరీల లో ఇమడని కారణం గా దేశం లో అత్యంత నిరాదరణ కు గురి అవుతున్న సముదాయం లో ఒక సముదాయం గా ఉంది. తత్ఫలితం గా వారు సామాజిక ఏకాకితనం మొదలుకొని విచక్షణ ను, విద్యా సౌకర్యాల లేమి ని, నిరుద్యోగాన్ని, వైద్య సదుపాయాల కొరత ను, ఇంకా తదితర అనేక సమస్యల ను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ బిల్లు ట్రాన్స్ జెండర్ సముదాయాని కి సామాజికం గా, విద్య పరం గా మరియు ఆర్థిక పరం గా సాధికారిత ను కల్పించగలుగుతుంది.
**
(Release ID: 1578412)
Visitor Counter : 199