గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సార్వజనిక పరిసరాల ను అనధికారికంగా ఆక్రమించుకొన్న వారి పై ఉక్కుపాదం
ప్రభుత్వ భవనాల ను అనధికారికంగా కబ్జా చేసిన వారి తొలగింపు నకు జాప్య రహిత చర్యలు
“ప్రభుత్వ ప్రాంగణాల (అనధికారిక ఆక్రమణదారుల తొలగింపు) సవరణ బిల్లు 2019”కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
కొత్త బిల్లు ను రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెడతారు
Posted On:
12 JUN 2019 7:58PM by PIB Hyderabad
ప్రభుత్వ భవనాల లో అనధికారికం గా నివాసం ఉంటున్న వారి ని తొలగించేందుకు ‘ప్రభుత్వ ప్రాంగణాల (అనధికారిక ఆక్రమణదారుల తొలగింపు) సవరణ బిల్లు 2019’కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ను రాబోయే పార్లమెంటు సమావేశాల లో ప్రవేశపెడతారు.
ప్రభావం:
ప్రభుత్వ భవనాల ను ఆక్రమించుకుని తిష్ఠ వేసిన వారి ని సత్వరం ఖాళీ చేయించేందుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న అర్హులైన వారికి వాటిని కేటాయించేందుకు ఈ సవరణ వీలు కల్పిస్తుంది. వెయిటింగ్ లిస్ట్ లో ప్రభుత్వ నివాసాల కోసం వేచి ఉండే వారి సంఖ్య సత్వరం తగ్గించేందుకు ఇది సహాయకారిగా ఉంటుంది.
అంతస్సూచనలు:
“ప్రభుత్వ ప్రాంగణాల (అనధికారిక ఆక్రమణల తొలగింపు) సవరణ బిల్లు 2017” స్థానం లో ఈ కొత్త బిల్లు తీసుకురావడమైంది.
కొత్త బిల్లు ను రాబోయే పార్లమెంటు సమావేశాల లో ప్రవేశపెట్టడం జరుగుతుంది.
అమలు:
ప్రభుత్వ ప్రాంగణాల (అనధికారిక ఆక్రమణల తొలగింపు) చట్టం 1971లోని 2వ, 3వ, 7వ సెక్షన్ లను ఈ బిల్లు ద్వారా సవరిస్తారు. సెక్షన్ 2 లోని క్లాజ్ ఎఫ్ బి కి ముందు క్లాస్ ఎఫ్ ఎ ను; సెక్షన్ 3ఎ దిగువన కొత్త గా సెక్షన్ 3బి ని; సెక్షన్ 7 సబ్ సెక్షన్ 3 కింద కొత్త గా సబ్ సెక్షన్ 3ఎ ను ప్రవేశపెడతారు.
ఆ సవరణ ల వల్ల ఆయా భవనాల లో అనధికారికం గా నివాసం ఉంటున్న వారిని తొలగించేందుకు, వ్యాజ్యం కాలం లో ఆక్రమించిన వారి పై డామేజి వసూలు చేసేందుకు అధికారం ఎస్టేట్ అధికారి కి దఖలుపడుతుంది. ప్రభుత్వ భవనాల లో దీర్ఘ కాలం పాటు తిష్ఠ వేసుకుని ఉన్న వారి ని సత్వరం ఖాళీ చేయించి, వాటి ని అర్హులైన వారి కి కేటాయించేందుకు మార్గం సుగమం అవుతుంది.
పూర్వరంగం:
ప్రభుత్వ భవనాల ను అనధికారికం గా ఆక్రమించుకుని నివాసం ఉంటున్న వారిని కేంద్ర ప్రభుత్వం పిపిఇ చట్టం, 1971 నిబంధనల ప్రకారం తొలగించవలసివుంది. కానీ ఈ తొలగింపు ప్రక్రియ లో అసాధారణ జాప్యం చోటు చేసుకోవడం వల్ల అవి కొత్త వారి కి అందుబాటు లో ఉండడం లేదు.
ప్రస్తుతం ఉన్న పిపిఇ చట్టం, 1971 లో- దేనినైతే పిపిఇ సవరణ బిల్లు, 2015 ప్రకారం సవరించడం జరిగిందో- కబ్జా చేసిన వారి ని ఖాళీ చేయించే వ్యవహార క్రమానికి 5 వారాల నుండి 7 వారాల వరకు కాలం పడుతుంది. అయితే, నిజానికి అనధికారిక కబ్జాదారులను తొలగించడానికి మరింత ఎక్కుం కాలమే, ఒక్కొక్క సారి సంవత్సరాలు పడుతోంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం అయితే, అలాంటి వారి ని ఖాళీ చేయించేందుకు సంబంధిత అధికారి నోటీసు ను జారీ చేయడం, సంజాయిషీ నోటీసు పంపడం, దర్యాప్తు జరపడం వంటి విధివిధానాలు ఏవీ అనుసరించవలసిన పని లేదు. కబ్జాదారులను సదరు అధికారి ఏకం గా ఖాళీ చేయించవచ్చు.
దేశం లోని పౌరుల కు పారదర్శకమైన, ఎలాంటి అవరోధాల కు తావు లేని పాలన ను అందించాలన్న ప్రభుత్వ వచనబద్ధత కు ఈ నిర్ణయం మరొక నిదర్శనం.
**
(Release ID: 1574449)