PIB Headquarters

రైతులు కేంద్ర బిందువు గా ఆర్ బిఐ ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2019’

Posted On: 03 JUN 2019 6:56PM by PIB Hyderabad

 ‘ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2019’ కార్యక్రమాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బిఐ) ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ సుబ్రత దాస్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ శ్రీ రాహుల్ బొజ్జా తో కలసి సోమవారం నాడిక్కడ ప్రారంభించారు.  ఈ సందర్భం గా జరిగిన సమావేశాని కి ఆర్ బిఐ హైదరాబాద్ కార్యాలయం లోని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డెవలప్ మెంట్ విభాగం జనరల్ మేనేజర్ శ్రీ సుందరం శంకర్భారతీయ రిజర్వు బ్యాంకు హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి ఎం. ఉషఇంకా నాబార్డ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం మరియు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం లకు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్ లు హాజరయ్యారు. 

 

     ప్రతి సంవత్సరం కీలకమైన అంశాల పై చైతన్యాన్ని వ్యాప్తి చేయడం కోసం ఈ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ కార్యక్రమాన్ని  భారతీయ రిజర్వు బ్యాంకు నిర్వహిస్తోంది.  ఈ ఏడాది  ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2019ని రైతులు సాంప్రదాయక బ్యాంకింగ్ వ్యవస్థ లో ఒక భాగం కావడం ద్వారా ఏ విధంగా లబ్ధి ని పొందగలుగుతారన్న ఇతివృత్తం పైన జూన్ 3వ తేదీ మొదలుకొని జూన్ 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. 

 

     దేశ సర్వతోముఖ ఆర్థిక అభివృద్ధి కి వ్యవసాయ రంగంలోని వృద్ధి అత్యవసరం.  ఇది జరగాలంటే ఆర్థిక సహాయం అనేది కీలకం.  రైతు సముదాయానికి రుణ మంజూరు ను పెంచడం కోసం అనువైన విధానాల రూపకల్పన లో ఆర్ బిఐ క్రియాశీలంగా పాలుపంచుకొంటోంది.  ఇటీవల కొన్ని సంవత్సరాలు గా ఆర్ బిఐ రుణాల మంజూరు యంత్రాంగాన్నిఅందరి కి ఆర్థిక సేవల అందజేత ను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను అమలుచేసింది. 

 

     రైతు లోకం లో ఫైనాన్షియల్ లిటరసీ సంబంధిత సందేశాల ను వ్యాప్తి చేసి వారి లో జాగృతి ని ప్రోది చేసేందుకు పోస్టర్లుకరపత్రాల ద్వారా వారి దృష్టి ని ఆకట్టుకోవాలని శ్రద్ధ వహిస్తున్నారు.  ఈ పోస్టర్లనుఇతరత్రా సమాచారాన్ని గ్రామాల లోని బ్యాంకుల శాఖ లలోనుఎటిఎమ్ లలోనుబ్యాంకుల వెబ్ సైట్ లలోను,  ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్ లలోను ప్రముఖంగా ప్రదర్శించాలని సూచించడమైంది.  అంతే కాకుండా రైతులకు ప్రధానమైన ఆర్థిక అవగాహన సంబంధ సందేశాల ను చేరవేసేందుకు దూర్ దర్శన్,  ఆకాశవాణి లలో జూన్ నెల లో మాస్ మీడియా క్యాంపెయిన్ ను ఆర్ బిఐ చేపట్టనుంది. 

 

     కాగా సోమవారం నాటి ప్రారంభ కార్యక్రమాని కి ఆంధ్రా బ్యాంకుకెనరా బ్యాంకుఇండియన్ బ్యాంకుసిండికేట్ బ్యాంకుహెచ్ డిఎఫ్ సి బ్యాంకు ల సీనియర్ అధికారులు,  తెలంగాణఆంధ్ర ప్రదేశ్ ఎస్ ఎల్ బిసి అధికారులుఇంకా ఐసిఎఆర్ - సిఆర్ఐడిఎఎటిఐఆర్ఐ ల డైరెక్టర్లు కూడా హాజరయ్యారు.

 

**    


(Release ID: 1573291) Visitor Counter : 205


Read this release in: English