పార్లమెంటరీ వ్యవహారాలు

పదహారో లోక్ సభ రద్దు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

प्रविष्टि तिथि: 24 MAY 2019 7:21PM by PIB Hyderabad

2014వ సంవత్సరం, మే నెల 18వ తేదీ నాడు ఏర్పాటైన పదహారో లోక్ సభ ను రద్దు చేయాలని రాష్ట్రపతి కి సలహా ఇచ్చే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

 

పూర్వరంగం:

 

ప్రజా సభ త్వరగా రద్దు చేయబడకపోయినట్లయితే- దాని తొలి సమావేశం కోసం నియామకం అయిన రోజు నుండి అయిదు సంవత్సరాల పాటు కొనసాగాలని, మరి అంతకు మించి కొనసాగ కూడదని, అలాగే ప్రస్తావించినటువంటి అయిదు సంవత్సరాల కాలం తీరిన అనంతరం సభ రద్దు కావాలని రాజ్యాంగం లోని 83(2) వ అధికరణం నిర్ధేశిస్తున్నది.  పదహారో లోక్ సభ ఒకటో సమావేశాన్ని 2014వ సంవత్సరం జూన్ 4వ తేదీ నాడు నిర్వహించడమైంది.  ఆ రోజు న సభ్యుల చేత పదవీస్వీకార ప్రమాణం చేయించడం జరిగింది.  ప్రస్తుత లోక్ సభ యొక్క జీవన కాలం ఈ కారణం గా.. రాష్ట్రపతి అంతకు మునుపే దాని ని రద్దు చేయని పక్షం లో.. 2019వ సంవత్సరం జూన్ 3వ తేదీ తో ముగియవలసివుంది.

 

గత ఎన్నికల ఆఖరు తేదీలు, ఒకటో లోక్ సభ నుండి పదిహేనో లోక్ సభ ఏర్పాటైన తేదీలు, ఒకటో సమావేశం మరియు పదవీకాలం యొక్క ముగింపు, ఇంకా రద్దు లను గురించి తెలిపే ఒక ప్రకటన ను దీనికి జతపరచడమైంది.

 

లోక్ సభ ఎన్నికల తేదీలు, నియామకం, ఒకటో సమావేశం, పదవీకాలం యొక్క ముగింపు మరియు రద్దు

 

లోక్ సభ (ఒకటో సభ మొదలుకొని పదిహేనో లోక్ సభ వరకు)

ఎన్నికల లో ఆఖరు తేదీ

సభ ఏర్పాటయిన తేదీ

ఒకటో సమవేశం యొక్క తేదీ

రాజ్యాంగం లోని 83(2)వ అధికరణం ప్రకారం పదవీ కాలం ముగిసిన  తేదీ

రద్దు చేయబడిన తేదీ

1

2

3

4

5

6

ఒకటో

21.02.1952

02.04.1952

13.05.1952

12.05.1957

04.04.1957

రెండో

15.03.1957

05.04.1957

10.05.1957

09.05.1962

31.03.1962

మూడో

25.02.1962

02.04.1962

16.04.1962

15.04.1967

03.03.1967

నాలుగో

21.02.1967

04.03.1967

16.03.1967

15.03.1972

*27.12.1970

అయిదో

10.03.1971

15.03.1971

19.03.1971

18.03.1977

*18.01.1977

ఆరో

20.03.1977

23.03.1977

25.03.1977

24.03.1982

*22.08.1979

ఏడో

06.01.1980

10.01.1980

21.01.1980

20.01.1985

31.12.1984

ఎనిమిదో

28.12.1984

31.12.1984

15.01.1985

14.01.1990

27.11.1989

తొమ్మిదో

26.11.1989

02.12.1989

18.12.1989

17.12.1994

*13.03.1991

పదో

15.06.1991

20.06.1991

09.07.1991

08.07.1996

10.05.1996

పదకొండో

07.05.1996

15.05.1996

22.05.1996

21.05.2001

*04.12.1997

పన్నెండో

07.03.1998

10.03.1998

23.03.1998

22.03.2003

*26.04.1999

పదమూడో

04.10.1999

10.10.1999

20.10.1999

19.10.2004

*06.02.1904

పద్నాలుగో

10.05.2004

17.05.2004

02.06.2004

01.06.2009

18.05.2009

పదిహేనో

13.05.2009

18.05.2009

01.06.2009

31.05.2014

18.05.2014

పదహారో

12.05.2014

18.05.2014

04.06.2014

03.06.2019

 

పదిహేడో

 

19.05.2019

 

 

 

 

 

* 1.  మధ్య కాలిక ఎన్నికలు జరిగాయి, ఎన్నికల కన్నా ముందుగానే రద్దు చోటు చేసుకొంది.

   2. రెండో కాలమ్ (2) లోని ఎన్నికల ఆఖరు తేదీలు ఎన్నికల సంఘం నివేదికల మేరకు ఉన్నాయి.

**


(रिलीज़ आईडी: 1572673) आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , हिन्दी , Kannada