సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కిర్గిజ్ స్తాన్ లో సెకండ్ ఎస్ సిఒ మాస్ మీడియా ఫోరమ్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ టి.వి.కె. రెడ్డి

Posted On: 24 MAY 2019 7:04PM by PIB Hyderabad
Press Release photo

ప్రస్తుతం వార్తా ప్రసార వ్యవస్థ ను న్యూ మీడియా విస్తరింపచేసిందనిదీనిలో మనలోని ప్రతి ఒక్కరు సమాచార వ్యాప్తి ప్రక్రియ లో ఒక నిర్మాత గానే కాకుండా ఒక వినియోగదారుగా కూడా ఉన్నారని హైదరాబాద్ లోని పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ టి.వి.కె. రెడ్డి అన్నారు. ఈ రోజు న కిర్గిజ్ స్తాన్ లో ని బిష్కెక్ లో జరిగిన సెకండ్ మాస్ మీడియా ఫోరమ్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సిఒ) లో పాలుపంచుకొన్న భారతదేశ ప్రతినిధివర్గం అధిపతి హోదా లో శ్రీ టి.వి.కె. రెడ్డి ప్రారంభోపన్యాసమిస్తూన్యూ మీడియా నుంచి పోటీ ఉన్నప్పటికీ సాంప్రదాయక ప్రసార మాధ్యమాలకు పాఠకులు మరియు శ్రోతలు పెద్ద సంఖ్యలో ఉన్నారని వివరించారు.  అంతేకాకుండా నకిలీ వార్తలను ప్రచారం లోకి తీసుకురావడమనేది ఆందోళన ను కలిగిస్తున్నటువంటి ఒక ధోరణి గా మారిపోయిందని కూడా  ఆయన అన్నారు.  సభ్యత్వ దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్నిఇంకా బాధ్యత ను పెంపొందించడం కోసం ఎస్ సిఒ సెక్రటేరియట్ లో ఒక నిజ నిర్ధారణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉండగలదని శ్రీ టి.వి.కె. రెడ్డి సూచన చేశారు.  నేటి గ్లోబల్ వరల్డ్ లో సాంస్కృతిక పరమైన చర్చ సాధ్యపడాలంటే అరమరికలు లేనటువంటిదిసానుకూల వైఖరిని కలిగివున్నదీ అయినటువంటి మీడియా ఎంతైనా అవసరమని ఆయన తెలిపారు.

 

     యూరేషియా ప్రాంత దేశాలకు సంబంధించిన రాజకీయఆర్థిక మరియు సైనిక సంబంధ సంస్థ గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సిఒ) పనిచేస్తోంది.  భారతదేశంకజకిస్తాన్కిర్గిజ్ స్తాన్రష్యాఉజ్ బెకిస్తాన్పాకిస్తాన్చైనా లకు ఎస్ సిఒ లో సభ్యత్వం ఉంది.  ఈ సంస్థ లోని సభ్యత్వ దేశాల మధ్య భద్రతపరమైనటువంటి సమస్యలనురహస్య సమాచారాన్ని వెల్లడించుకోవడానికిఇంకా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సహకారం ఉండాలనేది ఎస్ సిఒ లక్ష్యాలలో కేంద్ర బిందువు గా ఉంది.  సభ్యత్వ దేశాల మధ్య పరస్పర విశ్వాసంగౌరవం వర్ధిల్లేందుకు ఇరుగు పొరుగు దేశాల నడుమ దీర్ఘ కాల ప్రాతిపదికను కలిగివుండేటటువంటి సయోధ్యమైత్రిఇంకా సహకారం ముఖ్యం అనేది షాంఘై స్ఫూర్తి కి కీలకంగా ఉంది.  ప్రపంచ జనాభా లో దాదాపు సగం జనాభా కుఅలాగే ప్రపంచ జీడీపీ లో నాలుగో వంతు జీడీపీ కి ఎస్ సిఒ లోని సభ్యత్వ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

 

** 



(Release ID: 1572564) Visitor Counter : 127


Read this release in: English