వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అడ్వాన్స్‌డ్ మాడల్ సింగిల్ విండో ను అభివృద్ధి పరచడం అనే అంశం లో భారతదేశానికి మరియు జపాన్ కు మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
10 JAN 2019 8:53PM by PIB Hyderabad
అడ్వాన్స్‌డ్ మాడల్ సింగిల్ విండో ను అభివృద్ధి పరచడం అనే అంశం లో భారతదేశానికి మరియు జపాన్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
ఈ ఎంఒయు తో ‘అడ్వాన్స్‌డ్ మాడల్ సింగిల్ విండో’ను అభివృద్ధి పరచడం మరియు వ్యాపార కార్యకలాపాల కోసం అవసరమైనటు వంటి పరిపాలన ప్రక్రియ ల కోసం భారతదేశం లోని కేంద్ర ప్రభుత్వం లోను, రాష్ట్ర ప్రభుత్వాల లోను దానిని అమలు లోకి తీసుకు వచ్చే విషయం లో భారతదేశానికి, జపాన్ కు మధ్య సహకారాని కి బాట పడనుంది. అలాగే, ప్రక్రియల ను శీఘ్రమైన పద్ధతి లో పూర్తి చేసేందుకు వీలు గా ఒక స్వరూపాన్ని తీర్చిదిద్దేందుకు కూడా దోహదం చేయనుంది. తద్వారా భారతదేశం లో వ్యాపార నిర్వహణ లో సౌలభ్యాన్ని ప్రోత్సహించే దిశ గా జరుగుతున్న ప్రయత్నాలు వేగవంతం కాగలవు. అడ్వాన్స్‌డ్ మాడల్ సింగిల్ విండో భారతదేశం లోపల మరియు భారతదేశాని కి వెలుపల సర్వోత్తమ అభ్యాసాల ఆధారం గా రూపుదిద్దుకుంది. ఇందులో తగిన ప్రమాణాల తో పాటు భారతదేశం లో సింగిల్ విండో ఏర్పాటు చేసే మార్గం లో ఎదురుకాగల సమస్యల ను కనుగొనే వీలు కూడా ఉంది. కాబట్టి, దీని ద్వారా పెట్టుబడి పెట్టడం సౌకర్యవంతం గా మారనుంది.
**
(Release ID: 1559573)